Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోనాల పండక్కి అమ్మమ్మ ఇంటికెళ్తే బాలికను పొలాల్లోకి లాక్కెళ్లి...

తెలంగాణ రాష్ట్రంలో ఓ మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. ప్రేమ పేరుతో ఓ యువకుడు మైనర్ బాలికను బలవంతంగా పొలాల్లోకి తీసుకెళ్లి రేప్ చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
సోమవారం, 17 సెప్టెంబరు 2018 (13:38 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఓ మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. ప్రేమ పేరుతో ఓ యువకుడు మైనర్ బాలికను బలవంతంగా పొలాల్లోకి తీసుకెళ్లి రేప్ చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ప్రేమ పేరుతో ఓ మైనర్‌ బాలిక వెంట పడుతున్న యువకుడు అవకాశం చూసుకుని ఆమెను పొలాల్లోకి బలవంతంగా లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు... 
 
తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా శివరంపురానికి చెందిన ఓ కుటుంబం నగరానికి వలస వచ్చింది. బాలిక తండ్రి రామకృష్ణాపురంలోని ఓ అపార్ట్‌మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. బాధితురాలు తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో అదేగ్రామానికి చెందిన రాజు (25) కొన్నాళ్లుగా ప్రేమ పేరుతో బాలికను వేధిస్తూ వచ్చాడు. 
 
ఈ నేపథ్యంలో ఇటీవల బాధిత బాలిక బోనాలకు సిద్ధిపేటలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన రాజు ఆ ఊరెళ్ళాడు. ఎవరూ లేని సమయంలో బాలికను సమీపంలోని పొలాల్లోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇది తెలిసిన బాలిక తల్లిదండ్రులు నేరేడ్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments