Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మార్పీ కంటే ఒక్క పైసా వసూలు చేశారో...: అకున్ సబర్వాల్ వార్నింగ్

హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్‌, షాపింగ్ మాల్స్‌లలో ఎమ్మార్పీ రేట్ల కంటే ఒక్క పైసా ఎక్కువ తీసుకున్నా తమకు ఫిర్యాదు చేయాలని తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ పిలుపునిచ్చారు.

Webdunia
సోమవారం, 4 జూన్ 2018 (10:27 IST)
హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్‌, షాపింగ్ మాల్స్‌లలో ఎమ్మార్పీ రేట్ల కంటే ఒక్క పైసా ఎక్కువ తీసుకున్నా తమకు ఫిర్యాదు చేయాలని తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ పిలుపునిచ్చారు.
 
హైదరాబాద్‌లోని మాల్స్, మల్టీ ప్లెక్స్‌లు, సినిమా హాల్స్‌లో తినుబండారాలు, కూల్‌డ్రింక్స్ తదితరాలపై ప్రేక్షకులను భారీగా దోచుకుంటున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వీటిపై ఆయన స్పందించారు. 
 
ఇప్పటికే, ప్రసాద్‌ ఐమ్యాక్స్‌, జీవీకే మాల్‌, పీవీఆర్‌ సెంట్రల్‌, ఇన్‌ఆర్బిట్‌ మాల్‌, పీవీఆర్‌ కాంప్లెక్స్‌, మీరజ్‌ షాపింగ్‌ మాల్స్‌, లియెనియో కార్నివాల్‌‌తో పాటు పలు షాపింగ్ మాల్స్‌లో సోదాలు నిర్వహించామనీ, కూకట్‌పల్లిలోని ఏషియన్‌ జీవీఆర్‌, కొత్త పేటలోని మీరాజ్ థియేటర్‌తో పాటు పలు మాల్స్‌పై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. 
 
ఎంఆర్పీకి మించి ఒక్క రూపాయి వసూలు చేసినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. మల్టీ ప్లెక్స్‌లు, సినిమా థియేటర్లలో మోసం జరిగినట్టు గమనిస్తే, 7330774444 నెంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అకున్‌ సభర్వాల్‌ కోరారు. తాము వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 
 
కాగా, ఒక్కో కూల్‌ డ్రింక్‌ దాదాపు రూ.250... వాటర్‌ బాటిల్‌ కొనుక్కుని తాగాలంటే రూ.80 చెల్లించాల్సిందే.. ఏ తిను బండారం కొనుక్కోవాలన్నా పెద్ద మొత్తంలో సమర్పించుకోవాల్సిందేనంటూ వినియోగదారులు గగ్గోలు పెట్టిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments