Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముందు వరుసలో అమ్మాయిలను కూచోబెట్టి మరీ ప్రొఫెసర్ శృంగార పాఠాలు... దేహశుద్ధి...

విద్యాబుద్ధులు నేర్పించాలని ఆచార్యులే కామావతారం ఎత్తారు. విద్యార్థునుల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం సంస్కృతం విభాగాధిపతి ఆచార్య ఏడుకొండలు నోరు తెరిస్తే చాలు వచ్చేది పాఠాలు కాదు. శృంగార పాఠాలు. ఆయన పాఠాలను వినేందుకు మగపిల్లలు అర

Webdunia
మంగళవారం, 7 నవంబరు 2017 (16:50 IST)
విద్యాబుద్ధులు నేర్పించాలని ఆచార్యులే కామావతారం ఎత్తారు. విద్యార్థునుల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం సంస్కృతం విభాగాధిపతి ఆచార్య ఏడుకొండలు నోరు తెరిస్తే చాలు వచ్చేది పాఠాలు కాదు. శృంగార పాఠాలు. ఆయన పాఠాలను వినేందుకు మగపిల్లలు అర్హులు కారు... అమ్మాయిలను ముందు వరుసలో కూచోబెట్టి బోధిస్తారు. ఆయన వక్ర పాఠాలు చెప్పడం ఆరంభించారంటే స్త్రీల అంగాంగ వర్ణనలు చేసి విద్యార్థునులకు నరకం చూపిస్తారు. 
 
ఈయన పాఠాలు వినలేక చాలామంది విద్యార్థునులు కళాశాల మానేసి టీసీ తీసుకుని వెళ్లిపోయారు. అలా వెళ్లలేని వారు ఆచార్యుల వారి వెకిలి చేష్టలకు రోజూ బలవుతూ నరకం అనుభవిస్తున్నారు. ఆచార్యుల ఆగడాలు శ్రుతి మించడంతో విద్యార్థులంతా కలిసి ఆచార్య గాయత్రీదేవికి విన్నవించుకున్నారు. ఆమె విద్యార్థునులను తీసుకెళ్లి విచారించగా అయ్యవారు దులపరించుకునే ప్రయత్నం చేశారు. 
 
ఐతే తమను వేధిస్తున్న వైనంపై వరుసబెట్టి విద్యార్థులంతా చెప్పనారంభించడంతో ఆయన నోట వెంట మాటరాలేదు. ఒక దశలో అంతా కలిసి ఆయన్ను కుమ్మేయాలని చూశారు. కానీ ఎలాగో నిలువరించగలిగారు. ఆయనపై రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. కాగా వర్శిటీలో జరిగిన వ్యవహారంపై మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆచార్యుల వేధింపులపై తమకు వెంటనే నివేదిక పంపాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments