Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ నేత పట్టాభిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు

Webdunia
శుక్రవారం, 22 అక్టోబరు 2021 (12:01 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి పట్టాభిని ఏపీ పోలీసులు శుక్రవారం మచిలీపట్నం జైలు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పట్టాభికి విజయాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. 
 
దీంతో శుక్రవారం ఉదయం ఆయనను మచిలీపట్నం నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఉదయం ఆయనకు వైద్య పరీక్షలను నిర్వహించిన అనంతరం రాజమండ్రికి తీసుకెళ్లారు. పట్టాభిని బుధవారం రాత్రి విజయవాడలోని ఆయన నివాసంలో అరెస్ట్ చేసి ఆ రాత్రి తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. 
 
ఆ తర్వాత గురువారం ఉదయం తోట్లవల్లూరు పీఎస్ నుంచి విజయవాడ మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. వాదనలు ఆలకించిన మేజిస్ట్రేట్ పట్టాభికి నవంబరు రెండో తేదీ వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments