Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో క్రమేపీ పెరుగుతున్న భక్తుల సంఖ్య, లక్షల్లో వస్తున్నారు

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (18:43 IST)
కరోనా కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గిపోయింది. కానీ ప్రస్తుతం పెరుగుతోంది. ఆన్లైన్ టిక్కెట్లతో పాటు సర్వదర్సనం టిక్కెట్లు ఇస్తుండటంతో భక్తులు టోకెన్లను పొంది తిరుమలకు చేరుకుంటున్నారు. గతంలో తిరుమల భక్తజన సంద్రంగా ఏవిధంగా ఉండేదో.. అదేవిధంగా ప్రస్తుతం కూడా మారుతోందని టిటిడి అధికారులు భావిస్తున్నారు.
 
తిరుమల శ్రీవారిని నవంబర్ నెలలో 8 లక్షల 47 వేల మంది భక్తులు దర్సించుకున్నారు. హుండీ ఆదాయం ఒకే నెలలో 61 కోట్ల 29 లక్షల రూపాయలు వచ్చింది. తిరుమల శ్రీవారి ఇ-హుండీ ద్వారా కానుకలు 3 కోట్ల 75 లక్షల రూపాయలు వచ్చాయి. 
 
శ్రీవారి లడ్డూలను 50.4 లక్షల వరకు భక్తులకు విక్రయించారు. అన్నప్రసాదాన్ని 8 లక్షల 99 వేల మంది స్వీకరించారు. 2 కోట్ల 92 లక్షల మంది తలనీలాలు సమర్పించారు. ఒకే ఒక్క నెలలో ఈ స్థాయిలో రాబడి, భక్తులు స్వామివారిని దర్సించుకోవడంతో టిటిడి అధికారులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా టిటిడి ఈఓ కె.ఎస్.జవహర్ రెడ్డి డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో వెల్లడించారు.
 
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలోని వైకుంఠ ద్వారాన్ని డిసెంబర్ 25 నుంచి జనవరి 3వ తేదీ వరకు 10 రోజుల పాటు తెరిచి ఉంచి భక్తులకు దర్సనభాగ్యం కల్పిస్తామన్నారు టిటిడి ఈఓ. ఇందుకోసం ఆన్లైన్లో 20 వేల చొప్పున ప్రత్యేక ప్రవేశ దర్సనా టిక్కెట్లను విడుదల చేస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబైలో శ్రీవాస్ దర్శకుడిగా ఫీనిక్స్ రాజా ఫస్ట్ పోస్టర్, 2D మోషన్ టీజర్‌ రిలీజ్

Mohabbat: మొహబ్బత్ నుంచి శ్రేయాసి సేన్ బ్యూటీఫుల్ పోస్టర్

పూరి జగన్నాథ్ ఆవిష్కరించిన చకోర- లూనార్ లవ్ బర్డ్ మూవీ మోషన్ పోస్టర్

Vivek Athreya : రవితేజ, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో కొత్త సినిమా

Sharva: పల్లెటూరి కుర్రాడి గా భోగి చిత్రంలో తోబుట్టువులతో శర్వా

తర్వాతి కథనం
Show comments