Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఉధృతి తగ్గితే అక్టోబర్‌లో వెలుపల బ్రహ్మోత్సవాలు.. గోల్డ్ డిపాజిట్లను?

Webdunia
శుక్రవారం, 28 ఆగస్టు 2020 (14:49 IST)
కరోనా ఉధృతి తగ్గితే అక్టోబర్‌లో బ్రహ్మోత్సవాలు వెలుపల నిర్వహిస్తామని తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి ప్రకటించింది. కరోనా కారణంగా వాహన సేవలు మాడవీధుల్లో నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. అయితే సెప్టెంబర్ 19 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తామని పాలకమండలి పేర్కొంది. అధిక మాసం సందర్భంగా ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలుంటాయని టీటీడీ తెలిపింది. 
 
చిన్నపిల్లల ఆస్పత్రి నిర్మాణానికి టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది. బర్డ్ ఆస్పత్రిలో రూ.5.5కోట్లతో అదనపు గదులను నిర్మించనున్నట్లు వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో 214 గదుల వసతి గృహ నిర్మాణానికి ఆమోదించినట్లు కూడా ఆయన చెప్పారు. టీటీడీ బంగారు నగలు, డిపాజిట్లతోపాటు పలు విషయాలపై పాలకమండలి శుక్రవారం సమావేశం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా షార్ట్‌ టర్మ్‌ డిపాజిట్‌ చేయడం వల్ల తక్కువ వడ్డీ వస్తుందని, లాంగ్ టర్మ్ డిపాజిట్ చేస్తే ఎక్కువ వడ్డీ వస్తుందన్న సభ్యులు తెలిపారు. అలాగే హుండీ ద్వారా రద్దయిన నోట్లు వస్తున్నాయని, ఇప్పటి వరకు రూ.50 కోట్లు పాత నోట్లు వచ్చినట్లు తెలిపారు. ఈ విషయంపై రిజర్వు బ్యాంకుకు అనేకసార్లు లేఖ రాసినట్లు పాలకమండలి సభ్యులు వెల్లడించారు. మరోసారి కేంద్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. బంగారు డిపాజిట్ పై చర్చించిన పాలక మండలి వాటిని 12 సంవత్సరాలు లాంగ్ టర్మ్ డిపాజిట్ చెయ్యాలని  నిర్ణయించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments