Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు సభలో వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్... జంప్ జిలానీయేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం "జన్మభూమి - మా ఊరు" కార్యక్రమం ప్రారంభమైంది. ఈకార్యక్రమం రెండో రోజైన బుధవారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా పులివెందులలో జరిగిన జన్మభూమి కార్యక్రమ

Webdunia
బుధవారం, 3 జనవరి 2018 (16:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం "జన్మభూమి - మా ఊరు" కార్యక్రమం ప్రారంభమైంది. ఈకార్యక్రమం రెండో రోజైన బుధవారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా పులివెందులలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ ఎవరూ ఊహించని దృశ్యం ఒకటి ఆవిష్కృతమైంది.
 
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైకాపాకు చెందిన కడప ఎంపీ, పార్టీ అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డికి దగ్గరి బంధువు అయిన వైఎస్ అవినాష్ రెడ్డి పాలుపంచుకోవడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. 
 
ఇటీవలి కాలంలో పలువురు వైకాపా ఎమ్మెల్యేలు జగన్‌కు టాటా చెప్పి అధికార తెలుగుదేశం పార్టీలో చేరుతున్న విషయం తెల్సిందే. ఈ పరిస్థితుల్లో వైఎస్ ఫ్యామిలీకే చెందిన వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందులలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన జన్మభూమి సభలో పాల్గొనడంతో అందరి దృష్టి ఆయనపై కేంద్రీకృతమైంది. 
 
కాగా, ఈ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఇచ్చిన మాట ప్రకారం పులివెందులకు నీరు ఇచ్చామన్నారు. రాయలసీమ హార్టికల్చర్‌ హబ్‌గా మారుతుందన్నారు. రాయలసీమలో ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్థికలోటు ఉన్నప్పటికీ రైతు రుణమాఫీ చేశామని గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments