Webdunia - Bharat's app for daily news and videos

Install App

05-04-202 శుక్రవారం దినఫలాలు - పూర్వ స్మృతులు జ్ఞప్తికి వస్తాయి...

రామన్
శుక్రవారం, 5 ఏప్రియల్ 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| ఫాల్గుణ ఐ|| ఏకాదశి ఉ.9.55 ధనిష్ఠ ప.3.04రా.వ.9.48 ల 11.18. ఉ.దు.8.22 ల 9.11 ప. దు. 12.27 ల 1.16.
 
మేషం :- రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి పెరుగుతుంది. మీ సంకల్పసిద్ధికి నిరంతరం శ్రమ, పట్టుదల చాలా ముఖ్యమని గమనించండి. స్త్రీలకు ఆర్జనపట్ల ఆసక్తి పెరుగుతుంది. చిన్నతరహా, కుటీర పరిశ్రమల వారికి ప్రోత్సాహకరం, చిరు వ్యాపారులకు చికాకులు తప్పవు. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు.
 
వృషభం :- ఉపాధ్యాయులకు ఒత్తిడి, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం తప్పవు. తొందరపాటుతనం వల్ల ధననష్టం, శ్రమాధిక్యత వంటి చికాకులు ఎదుర్కుంటారు. స్త్రీలు గత కొంతకాలంగా అనుభవిస్తున్న సమస్యలు పరిష్కారం కాగలవు. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళకు లొంగకుండా స్థిరచిత్తంతో వ్యవహరించవలసి ఉంటుంది.
 
మిథునం :- అకాల భోజనం, శ్రమాధిక్తవల్ల పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు ఆటంకాలు తప్పవు. వ్యాపారాలు, లీజు, ఏజెన్సీ వ్యవహారాలలో మెళకువ వహించండి. మీ కష్టం, సమర్ధతలను ఇతరులు తమ స్వార్థానికి వాడుకుంటారు. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.
 
కర్కాటకం :- దైవ కార్యక్రమాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. పూర్వ స్మృతులు జ్ఞప్తికి వస్తాయి. రావలసిన ధనం కొంత ముందు వెనుకలగానైనా అందుతుంది. తలకు మించిన భాధ్యతలతో తలమునకలౌతుంటే కాస్త ఓప్పిగా వ్యవహరించండి. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ఆకర్షణలకు దూరంగా ఉండటం అన్నివిధాలా క్షేమదాయకం.
 
సింహం :- ఆలయ సందర్శనాల కోసం ధనం ఖర్చు చేస్తారు. ఒక వ్యవహారం నిమిత్తం ప్లీడర్లు, ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతిలో వచ్చిన మార్పు మీకెంతో సంతృప్తినిస్తుంది. మీ చికాకులు, ఇబ్బందులు తాత్కాలికమేనని గమనించండి. పెద్దమొత్తం నగదు, ఆభరణాలతో ప్రయాణం క్షేమంకాదు.
 
కన్య :- ఏ కొంతమొత్తమైనా పొదుపు చేయాలన్న మీ ఆలోచన ఫలిస్తుంది. మీ బలహీనతలు, మాటతీరు అదుపులో ఉంచుకోవటం క్షేమదాయకం. స్త్రీలు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులు ఎదుర్కుంటారు. వారసత్వపు వ్యవహారాలలో చికాకులు ఎదుర్కొంటారు. మీ శ్రీమతి, సంతానం గొంతెమ్మ కోరికలు ఇబ్బంది కలిగిస్తాయి.
 
తుల :- వ్యాపారాల్లో సంతృప్తికరమైన లాభాలు, అనుభవం గడిస్తారు. వాహనం, విలువైన వస్తువులు మరమ్మతులకు గురికావచ్చు. ఉద్యోగ విరమణ చేసిన వారికి అధికారులు, సహోద్యోగులు ఘనంగా వీడ్కోలు పలుకుతారు. స్త్రీలకు శ్రీవారి తరపు బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. సోదరులతో ఏకీభవించలేకపోతారు.
 
వృశ్చికం :- పాత బాకీలు వసూలవుతాయి. ఇతరులు చెప్పిన మాటపై దృష్టిపెట్టకండి. ఉద్యోగస్తులు పై అధికారులతో సంభాషించేటప్పుడు మెళకువ వహించండి. ఆత్మీయులతో మీ సమస్యలు చెప్పుకున్నందు వల్ల పరిష్కార మార్గం, మానసిక ప్రశాంతత పొందుతారు. సాముహిక దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
ధనస్సు :- మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిదికాదు. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి కలిసిరాగలదు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. దూరపు బంధువులను కలుసుకొని ఆసక్తికరమైన విషయాలు చర్చిస్తారు. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి.
 
మకరం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. కొన్ని బంధాలను నిలుపుకోవటానికి కష్టపడాల్సి వస్తుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోనివారికి మిశ్రమ ఫలితం. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది.
 
కుంభం :- ప్రతి పని చేతిదాకా వచ్చివెనక్కి పోవుటవలన ఆందోళన పెరుగుతుంది. మీరు చేయని కొన్ని పనులకు మీద నిందలు మోపే అవకాశం ఉంది. అధికారులతో సంభాషించేటపుడు మెళుకువ అవసరం. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ప్రియతములలో మార్పు మీకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
 
మీనం :-ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల పట్ల ఆసక్తి పెరుగును. బ్యాంకింగ్ రంగాల వారు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత చూపుతారు. కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికి వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. మీరు చేయని కొన్ని పనులకు మీద నిందలు మోపే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో పాకిస్థాన్ ఎక్కడెక్కడ దాడులు చేస్తుంది? హైదరాబాద్ - వైజాగ్‌లు ఏ కేటగిరీలో ఉన్నాయి?

రిజర్వేషన్ వ్యవస్థ రైలు కంపార్టుమెంట్‌లా మారిపోయింది : సుప్రీం జడ్జి సూర్యకాంత్

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా?

Jagan Padayatra 2.0 : 2027లో పాదయాత్ర 2.0 చేపడతారు.. గుడివాడ అమర్‌నాథ్

భారత్ దెబ్బకు ఎండిపోతున్న పాక్ నదులు... ఖరీఫ్ సీజన్ నుంచే నీటి కటకటా

అన్నీ చూడండి

లేటెస్ట్

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

02-05-2025 శుక్రవారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది...

How to Worship God: పూజను నిల్చుని చేయాలా? లేకుంటే కూర్చుని చేయాలా?

తర్వాతి కథనం
Show comments