Webdunia - Bharat's app for daily news and videos

Install App

10-11-2024 ఆదివారం రాశిఫలాలు - ఆప్తులతో సంభాషిస్తారు...

రామన్
ఆదివారం, 10 నవంబరు 2024 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. ఆప్తులతో సంభాషిస్తారు. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు మందకొడిగా సాగుతాయి. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. ప్రయాణంలో ఒకింత అవస్థలు ఎదుర్కుంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
రోజువారీ ఖర్చులే ఉంటాయి. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తిచేస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. పిల్లల దూకుడు అదుపు చేయండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వనసమారాధనలో పాల్గొంటారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యానుకూలత ఉంది. విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఖర్చులు విపరీతం. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. శుభకార్యానికి హజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రణాళికలు వేసుకుంటారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. సంబంధ బాంధవ్యాలు మెరుగుపడుతాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. న్యాయ వివాదాలు కొలిక్కివస్తాయి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. పనులు పురమాయించవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. కీలక పత్రాలు సమయానికి కనిపించవు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు సాగవు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ముఖ్యులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
చాకచక్యంగా వ్యవహరిస్తారు. కష్టానికి గుర్తింపు లభిస్తుంది. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు.. బాధ్యతగా మెలగాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఖర్చులు విపరీతం. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
రావలసిన ధనం అందుతుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. సన్నిహితులతో సంభాషిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
చాకచక్యంగా వ్యవహరించాలి. ప్రతికూలతలు అధికం. అవకాశాలు చేజారిపోతాయి. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. ఖర్చులు విపరీతం. రుణ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడండి. పనులు సానుకూలమవుతాయి. దైవ, వనసమారాధనల్లో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
దుబారా ఖర్చులు విపరీతం. ఆలోచనలు నిలకడగా ఉండవు. నిస్తేజానికి లోనవుతారు. ఆప్తులతో కాలక్షేపం చేయండి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. కీలక చర్చల్లో పాల్గొంటారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. ప్రయాణం తలపెడతారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు సామాన్యం. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య సఖ్యత లోపం. ఆరోగ్యం మందగిస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

దుర్భాషలాడిన భర్త.. ఎదురు తిరిగిన భార్య - పదునైన ఆయుధంతో గుండు గీశాడు..

CM Revanth Reddy: మిస్ వరల్డ్ 2025 పోటీలు- పటిష్టమైన భద్రతా చర్యలు

Ahmedabad: అక్రమ బంగ్లాదేశ్ నివాసితులపై కొరడా: అదుపులోకి వెయ్యి మంది (Video)

Pawan Kalyan : మధుసూధన్ రావు ఎవరికి హాని చేశాడు? పవన్ కల్యాణ్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ 2025 -గంగా నది స్వర్గం నుండి భూమికి దిగివచ్చిన రోజు

26-04-2015 శనివారం ఫలితాలు - ఓర్పుతో యత్నాలు సాగించండి...

అప్పుల బాధలను తీర్చే తోరణ గణపతి పూజ ఎలా చేయాలి?

25-04-2015 శుక్రవారం ఫలితాలు - అనుమానిత వ్యక్తులతో సంభాషించవద్దు..

Saturn moon conjunction: మీనరాశిలో చంద్రుడు, శని.. ఎవరికి లాభం?

తర్వాతి కథనం
Show comments