కొబ్బరి నూనె వేడిచేసి.. నిమ్మరసం కలిపి...?

Webdunia
శనివారం, 2 ఫిబ్రవరి 2019 (11:01 IST)
చలికాలం కారణంగా తల భాగంలో తేమ తగ్గిపోవడంతో వెంట్రుకలు పొడిబారడం, చిక్కులు పడడం, రాలిపోవడం వంటివి జరుగుతున్నాయి. ఈ సమస్యల నుండి విముక్తి పొందాలని బయటదొరికే నూనెలు, ఇతర పదార్థాలన్నీ వాడుతున్నారు. వీటి వాడకం మంచిది కాదంటున్నారు బ్యూటీ నిపుణులు. అందుకు ఇంట్లోని సహజసిద్ధమైన పదార్థాలతో మెరిసే కురులను మీ సొంతం చేసుకోవచ్చును. మరి అవేంటో చూద్దాం...
 
తలస్నానం చేసిన తరువాత వెంట్రుకలను బాగా ఆరబెట్టాలి. ఒకవేళ ఆరబెట్టకుండా జుట్టు తడిగా ఉన్నప్పుడు ముడి వేసుకోవడం వలన జుట్టు కొసలు చిట్లే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయంటున్నారు నిపుణులు. కనుక తలస్నానం చేసిన వెంటనే కురులకు గట్టిగా టవల్ కట్టుకోవాలి. ఆపై ఓ 15 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తరువాత టవల్ తీసి జుట్టు ఆరబెట్టాలి. ఇలా క్రమంగా చేస్తే జుట్టు చివర్ల చిట్లకుండా ఉంటుంది. 
 
ఆలివ్ నూనె కురులకు కావలసిన తేమను అందిస్తుంది. దాంతో పొడిబారిన జుట్టును మృదువుగా, కాంతివంతంగా చేస్తుంది. కనుక వారంలో రెండుసార్లు ఆలివ్ నూనెను తలకు పట్టించి.. ఓ అరగంట తరువాత తలస్నానం చేయండి.. ఇలా నెలరోజుల పాటు క్రమంగా చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. ఆలివ్ నూనె తలకు రాసుకోవడం వలన తల భాగానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. 
 
కొబ్బరి నూనె ప్రతీ ఇంట్లో తప్పకుండా ఉంటుంది. కాబట్టి.. 2 స్పూన్ల కొబ్బరి నూనెను వేడి చేసుకోవాలి. ఆపై ఆ నూనెలో కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ నూనెలో కాటల్ బాల్‌ను ముంచి ఆపై దానితో కురులకు మర్దన చేసుకోవాలి. ఇలా చేసిన అరగంట తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు పొడిబారకుండా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. జుట్టు రాలిపోకుండా ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రోగనిరోధక శక్తి లేని వ్యక్తులలో కోవిడ్.. నిరంతర అంటువ్యాధులకు..?

#HelloAP_VoteForJanaSenaTDP : చిలకలూరి పేటలో భారీసభ.. బస్సులు కావాలి..

మార్చి 10న అయోధ్యలో రన్-ఫర్-రామ్.. 3వేల మందికి పైగా..?

మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్‌కుమార్ రెడ్డి

హవాలా మనీ.. మాదాపూర్ వద్ద రూ.50లక్షలు స్వాధీనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ చందమామకు చేదు అనుభవం.. అభిమాని అలా..?

దీపికా లేనప్పుడు డార్లింగ్‌ను ఫోటో తీసిన దిశా పటానీ

డిజిటల్ శక్తి అలా ఉపయోగించుకుంటున్న సమంత

కెరీర్ కోసం డింపుల్ హాయతి లిక్కర్ పూజలు

ఆ హీరో నాకు బంగ్లా కొనిపెట్టాడా.. రాసేటప్పుడు ఆలోచించండి..?

తర్వాతి కథనం
Show comments