చర్మం మెరిసిపోతుంది... ఈ ఐదు చిట్కాలు పాటిస్తే...

ఈ రోజుల్లో తక్కువ వయస్సులోనే చాలామంది వయసు మీద పడినట్లు కనిపిస్తున్నారు. తీసుకునే ఆహారంలో చర్మ ఆరోగ్యాన్ని పెంచే ఆహారాలు లేకపోవడం, కాలుష్యం వంటి కారణాల వల్ల చర్మం పొడిబారడం, తక్కువ వయసులోనే ముడతలు పడటం వల్ల కాంతిహీనంగా తయారవుతుంది. అయితే యాంటీ ఏజింగ్

Webdunia
శనివారం, 4 ఆగస్టు 2018 (20:47 IST)
ఈ రోజుల్లో తక్కువ వయస్సులోనే చాలామంది వయసు మీద పడినట్లు కనిపిస్తున్నారు. తీసుకునే ఆహారంలో చర్మ ఆరోగ్యాన్ని పెంచే ఆహారాలు లేకపోవడం, కాలుష్యం వంటి కారణాల వల్ల చర్మం పొడిబారడం, తక్కువ వయసులోనే ముడతలు పడటం వల్ల కాంతిహీనంగా తయారవుతుంది. అయితే యాంటీ ఏజింగ్ మరియు యాంటీ ఆక్సీడెంట్స్ లక్షణాలు కలిగిన కూరగాయలు, పండ్లు తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండడంతో పాటు చర్మంపై ముడతలు, చర్మం వదులుగా మారడం వంటి లక్షణాలు తగ్గుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
 
1. కివీ పండు విటమిన్-సి తోపాటు యాంటీ ఆక్సీడెంట్‌ను సమృద్ధిగా కలిగి ఉంది. ఇది చర్మానికి కావలసిన పోషకాలను అందించి చర్మం మీద ముడతలను నివారిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాలు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.
 
2. తరచుగా దానిమ్మ గింజలు మరియు దానిమ్మ జ్యూస్ తీసుకోవడం వల్ల ఇది చర్మ కణాలకు కావలసిన పోషకాలను అందిస్తుంది. దానిమ్మ చర్మాన్ని బిగుతుగా మార్చే యాంటీ ఏజింగ్ లక్షణాలను సమృద్ధిగా కలిగి ఉంది. ఇది మీ చర్మానికి కావలసిన పోషణను అందించి అందం, మంచి గ్లోయింగ్ వచ్చేలా సహాయపడుతుంది.
 
3. పుచ్చకాయ చర్మానికి కావలసిన పోషకాలను అందించి చర్మం ముడతలు పడకుండా నివారిస్తుంది. ఇది చర్మానికి కావలసిన తేమను అందించి డీహైడ్రేషన్ బారిన పడకుండా చూస్తుంది. పుచ్చకాయ గింజల్లో కూడా చర్మ సౌందర్యానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
 
4. ద్రాక్ష కూడా చర్మ సౌందర్యాన్ని పెంచడంలో ఎంతో దోహదపడుతుంది. ఇందులో ఉండే మాంగనీస్ అల్ట్రావయోలెట్ రేడియేషన్స్‌తో పోరాడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఫ్రీరాడికల్స్‌తో పోరాడి వయసు పెరగడం వలన వచ్చే చర్మ లక్షణాలను తగ్గిస్తుంది.
 
5. యాపిల్‌లో చర్మం ముడతల సమస్యను ఎదుర్కొనే లక్షణాలు అధికంగా ఉన్నాయి. తరచుగా యాపిల్‌ని తిన్నా లేదా యాపిల్ గుజ్జును చర్మానికి అప్లై చేసుకున్నా వృద్ధాప్యపు గుర్తులను తగ్గించుకోవచ్చు. ఇందులో ఉన్న పోషకాలు మరియు యాంటీ ఏజింగ్ లక్షణాలు చర్మాన్ని తాజాగా ఉంచుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

స్పోర్ట్స్ బైక్ పైన యువతీయువకులు రీల్స్... డివైడర్‌ను ఢీకొట్టి యువతి మృతి, వీడియో

జూబ్లిహిల్స్‌లో నా ఇంటిని కాజేసేందుకు నన్ను ఎర్రగడ్డలో చేర్చాలని చూస్తున్నారు: నటి సజినీ ఆవేదన

చరిత్ర సృష్టించాం... డేటా సెక్యూరిటీ నిపుణులుగా మారుస్తా : సీఎం చంద్రబాబు

బీహార్ కొత్త ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీ

Heat Wave Alert : ఐదు రోజుల పాటు తెలంగాణలో వడగాలులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: శర్వానంద్, సంపత్ నంది చిత్రం భోగి హై-ఆక్టేన్ యాక్షన్ కొత్త షెడ్యూల్

Samantha: సమంత నటించిన మా ఇంటి బంగారం ఆడియో హక్కులు పొందిన థింక్ మ్యూజిక్

Suriya: తమిళ సంవత్సర సందర్భంగా సూర్య కరుప్పు నుండి రాతు రాసన్ విడుదల

స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే నుండి రెండు సరికొత్త పోస్టర్లు విడుదల

టాలీవుడ్‌లో మరో ఐరెన్ లెగ్ హీరోయిన్ శ్రీలీలనా?

తర్వాతి కథనం
Show comments