Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రైవర్ రహిత కార్లకు భారత్‌లో నో ఎంట్రీ.. తేల్చి చెప్పిన గడ్కరీ

డ్రైవర్ రహిత కార్ల(డ్రైవర్ లెస్ కార్స్)కు భారత్ నో చెప్పింది. ఇలాంటి కార్ల వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని, అందువల్ల ఈ తరహా కార్లను అనుమతించే ప్రసక్తే లేదని కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్ గ

Webdunia
మంగళవారం, 25 జులై 2017 (08:41 IST)
డ్రైవర్ రహిత కార్ల(డ్రైవర్ లెస్ కార్స్)కు భారత్ నో చెప్పింది. ఇలాంటి కార్ల వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని, అందువల్ల ఈ తరహా కార్లను అనుమతించే ప్రసక్తే లేదని కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. 
 
డ్రైవర్ లెస్ కార్లకు అమెరికా కాంగ్రెస్ ప్యానెల్ ఓకే చెప్పింది. కాంగ్రెస్ నిర్ణయంతో వేలాది సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు రోడ్లకెక్కనున్నాయి. సెర్చింజన్ దిగ్గజం గూగుల్, టెక్నాలజీ దిగ్గజం ఆపిల్, రైడ్ హెయిలింగ్ కంపెనీ ఉబెర్ టెక్నాలజీస్ తదితర కంపెనీలు సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల ఉత్పత్తిలో బిజిగా ఉన్నాయి.
 
కాంగ్రెస్ నిర్ణయంపై నితిన్ గడ్కరీ స్పందిస్తూ.. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల వల్ల వేలాదిమంది డ్రైవర్లు నిరుద్యోగులయ్యే అవకాశం ఉందన్నారు. పైగా, ప్రస్తుతం దేశంలో నిరుద్యోగ సమస్య అధికంగా ఉందన్నారు. ఇలాంటి సందర్భాల్లో ఈ తరహా కార్లను ఎలా అనుమతిస్తామని ఆయన తెలిపారు. 
 
అయితే, పర్యావరణ హిత, కాలుష్య రహిత ప్రజా రవాణా కోసం కృషి చేస్తున్నట్టు తెలిపారు. రోడ్లమీదికి వచ్చే వాహనాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ దేశంలో ఏడాదికో జాతీయ రహదారి నిర్మించాల్సి వస్తుందన్నారు. కాబట్టి ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. అందుకోసం విద్యుత్, ఇథనాల్, బయో-డీజిల్, బయోగ్యాస్, ఎల్ఎన్‌జీ తదితర వాటితో నడిచే బస్సులను ప్రవేశపెడతామన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటులు అమ్ముడుపోయారు - ప్రకాష్ రాజ్ కామెంట్స్

మండాడి నుండి సూరి, సుహాస్ ఫస్ట్ లుక్ విడుదల

రిహాబిలిటేషన్ సెంటర్‌ కు వెళ్ళిన అల్లు అరవింద్, బన్నీ వాసు

Mrunal Thakur And Sumanth: మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిన సుమంత్..? త్వరలోనే పెళ్లి..?

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments