నేతితో వంకాయ వేపుడు ఎలా?

సెల్వి
గురువారం, 29 ఆగస్టు 2024 (22:07 IST)
brinjal
వంకాయ శరీరంలో కొవ్వులను కరిగిస్తుంది. వంకాయలోని ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బీ3, బీ6, బీటా కేరోటిన్, యాంటీఆక్సిడెంట్లు తదితర పోషకాలు గుండెపోటు, స్ట్రోక్ ముప్పును తగ్గిస్తాయి. వంకాయలో పిండి పదార్థాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. అలాంటి వంకాయను నేతితో వేపుడులా చేస్తే ఎలా వుంటుందో చూద్దాం.. 
 
కావాల్సిన పదార్థాలు:
వంకాయలు-పావు కేజీ
ఆవాలు- ఒక స్పూన్
జీలకర్ర-అర స్పూన్
ఎండు మిర్చి- 2
పచ్చి మిర్చి- 1
ఆయిల్‌, నెయ్యి - చెరో రెండు స్పూన్లు 
కొత్తి మీర, కరివేపాకు -తగినంత 
ధనియాల పొడి, జీలకర్ర పొడి - చెరోస్పూన్
కారం, పసుపు, ఉప్పు - తగినంత
 
తయారీ విధానం: స్టవ్ మీద బాణలి పెట్టి వేడయ్యాక.. అందులో కొద్దిగా ఆయిల్‌, కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. ఆ తర్వాత ఎండు మిర్చి, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి వేగాక.. కట్‌ చేసిన వంకాయ ముక్కలు కూడా వేసి మెత్తగా అయ్యేంత వరకూ ఉడికించాలి. 
 
బాగా వేగాక ధనియాల పొడి, జీలకర్ర పొడి ఉప్పు, కారం, పసుపు వేసి ఓ ఐదు నిమిషాలు వేయించాలి. అంతే నేతితో చేసిన వంకాయల వేపుడు రెడీ.. దించే ముందు కొత్తిమిర తరుగు వేసుకోవాలి. ఈ నేతి వంకాయ వేపుడు వేడి వేడి అన్నం, చపాతీ, రోటీ, పుల్కాలకు సైడిష్‌గా సర్వ్ చేయొచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేరళలో షిగెల్లా కేసులు.. జనవరి నుంచి 146.. జూన్‌లో మాత్రమే 70 కేసులు

జనసేనలో కొత్తగా సమన్వయ కమిటీ : పవన్ కళ్యాణ్

బద్రీనాథ్ పుణ్యక్షేత్రానికి ముకేశ్ అంబానీ భారీ విరాళం

నరహరి ఇంట్లో సోదాలు.. అమ్మో ఎంత డబ్బు.. ఎంత బంగారం.. ఏసీబీ షాక్ (video)

19 నుంచి భారీ వర్ష సూచన : వాతావరణ శాఖ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంచన 4లో నటించనున్న లేడీ సూపర్ స్టార్ నయనతార?

Vishal: సీఎం విజయ్ చెప్పినట్లు చేశానంటున్న విశాల్

యూట్యూబర్ ఖలీద్‌తో బ్రేకప్ చెప్పేసిన నటి సునైనా?

Peddi Article: పెద్ది కలెక్లన్ల ద్వారా తెలుగు ఇంఢస్ట్రీ ఏం నేర్చుకుంది? ఇంకా ఏం నేర్చుకోవాలి?

శ్రీనగర్ యువతిని పెళ్లాడిన ఊర్మిళా మాటోండ్కర్ మాజీ భర్త

తర్వాతి కథనం
Show comments