Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో విజృంభిస్తున్న కరోనా.. త్రిపురను వణికిస్తున్న డెల్టా ప్లస్‌ వేరియంట్‌

Webdunia
శనివారం, 10 జులై 2021 (12:57 IST)
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 42,766 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక 45,254 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 1206 మంది వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు ఇండియాలో నమోదు అయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,95,716గా ఉంది. దేశంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,07,145కు చేరుకుంది.
 
త్రిపురను డెల్టా ప్లస్‌ వేరియంట్‌ వణికిస్తోంది. 151 శాంపిల్స్‌ను జీనోమ్‌ స్వీకెన్సింగ్‌కు పంపగా...138 కేసులు డెల్టా ప్లస్‌ వేరియంట్‌గా తేలాయని రాష్ట్ర ఆరోగ్య నిఘా అధికారి డా.దీప్‌ కుమార్‌ దెబ్బర్మా శుక్రవారం సాయంత్రం తెలిపారు. ఈశాన్య ప్రాంతంలో డెల్టా వేరియంట్‌ ప్లస్‌ కేసులు నమోదు చేసిన తొలి రాష్ట్రంగా త్రిపుర నిలిచింది. 
 
బెంగాల్‌లోని కల్యాణిలో ల్యాబోరేటరీకి పరీక్షల కోసం శాంపిల్స్‌ను పంపామని, మొత్తం 151 కేసులుగానూ 138 డెల్టా వేరియంట్‌ ప్లస్‌ కేసులుగా గుర్తించారని అన్నారు. మిగిలిన 10 కేసులు డెల్టా వేరియంట్‌ కాగా, మూడు కేసులు అల్ఫా వేరియంట్‌గా గుర్తించినట్లు దీప్‌ కుమార్‌ చెప్పారు. 
 
ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చేసేందుకు నైట్‌ కర్ఫ్యూతో పాటు 13 అర్బన్‌ ప్రాంతాల్లో వారాంతపు లాక్‌డౌన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంట వరకు వారాంతపు లాక్‌డౌన్‌ను విధించింది. నైట్‌ కర్ఫ్యూను జులై 17 వరకు పొడిగించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments