Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ ఆసీస్ చేతుల్లోకి పోతోందా.. మనవాళ్లకు సత్తాలేదా..

పొట్టి క్రికట్ చరిత్రకు తలమానికంగా నిలుస్తున్న ఐపీఎల్‌లో రాన్రానూ ఆసీస్ క్రికెటర్ల హవా నడుస్తోందా. భవిష్యత్తులో అన్ని ఐపీఎల్ జట్లకూ ఆసీస్ ఆటగాళ్లనే కెప్టెన్‌లుగా నియమించే పరిణామాలు మన కళ్లముందే జరిగిప

Webdunia
శనివారం, 11 మార్చి 2017 (03:52 IST)
పొట్టి క్రికట్ చరిత్రకు తలమానికంగా నిలుస్తున్న ఐపీఎల్‌లో రాన్రానూ ఆసీస్ క్రికెటర్ల హవా నడుస్తోందా. భవిష్యత్తులో అన్ని ఐపీఎల్ జట్లకూ ఆసీస్ ఆటగాళ్లనే కెప్టెన్‌లుగా నియమించే పరిణామాలు మన కళ్లముందే జరిగిపోతున్నాయా? అంటే అవుననే చెప్పాలి. ఇప్పటికే రెండు జట్లకు ఆసీస్ ఆటగాళ్లే రథసారథులుగా ఉండగా ఇప్పుడు మూడో జట్టుకు కూడా  ఆసీస్ ఆటగాడే శరణ్యమైపోయాడు. దీన్నంతా చూస్తుంటే ఐపీఎల్ పేరు కూడా ఎపీఎల్ (ఆస్ట్లేలియా ప్రీమియర్ లీగ్) అని మారిపోతుందా అని సందేహాలు కలుగుతున్నాయి.
 
 
త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ పదో సీజన్ కోసం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కొత్త కెప్టెన్‌ను నియమించింది. మురళీ విజయ్ స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఇప్పటికే ఆసీస్‌కు చెందిన డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్ కెప్టెన్‌‌గా ఉండగా.. పుణే జట్టు ధోనీ స్థానంలో స్టీవ్ స్మిత్‌కు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. కెప్టెన్‌గా మ్యాక్స్‌వెల్‌ను నియమించిన విషయాన్ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఆ జట్టు ప్రధాన కోచ్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ విషయాన్ని ట్వీట్ చేశాడు.
 
ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, వెస్టిండీస్ ప్లేయర్ డారెన్ సమీతోపాటు సౌతాఫ్రికా వెటరన్ ప్లేయర్ హషీమ్ ఆమ్లాలను కాదని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాక్స్‌వెల్‌కు బాధ్యతలు అప్పగించడం విశేషం. భుజం గాయం కారణంగా మిగతా రెండు టెస్టులకు దూరమైన మిషెల్ మార్ష్ స్థానంలో జట్టులోకి వచ్చేందుకు మ్యాక్స్‌వెల్ ప్రయత్నిస్తున్నాడు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad Woman Doctor: రూ.5 లక్షల విలువైన కొకైన్ కోసం ఆర్డర్ చేసిన వైద్యురాలు

Vidadala Rajini: విడదల రజినికి మరో ఎదురుదెబ్బ- అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ (video)

My Sindoor to Border: పెళ్లైన మూడు రోజులే. నా సింధూరాన్ని సరిహద్దులకు పంపుతున్నా..

Asaduddin Owaisi: పాకిస్తాన్ మజాక్ చేస్తుంది.. భారత్ కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం.. ఓవైసీ (video)

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

తర్వాతి కథనం
Show comments