Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుమ్రా తొలి సిక్సర్.. అయినా 19ఏళ్ల రికార్డును సమం చేశాడు.. ఎలాగంటే? (Video)

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (11:58 IST)
ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో భారత్ ఖంగుతిన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఒక బంతిలో 19 ఏళ్ల రికార్డును బుమ్రా సమం చేశాడు. భారత్‌లో ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జట్టు టీమిండియాతో ఐదు వన్డేలతో కూడిన సిరీస్ ఆడుతోంది. తొలి మూడు వన్డేల్లో భారత్ 2-1 తేడాతో ఆధిక్యంలో వుండగా.. నాలుగో వన్డేలో ఓడటం ద్వారా 2-2 తేడాతో ఆసీస్ సిరీస్‌ను సమం చేసింది.
 
కాగా ఆదివారం జరిగిన నాలుగో వన్డేలో టాస్ గెలిచిన భారత జట్టు 358 పరుగులు సాధించినప్పటికీ పరాజయం పాలైంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలుత బ్యాటింగ్‌ను ఎంచుకున్నాడు. రోహిత్ శర్మ (95), ధావన్ (143) భాగస్వామ్యంతో భారత్ భారీ స్కోరు నమోదు చేసుకుంది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 358 పరుగులు సాధించింది. 
 
అయితే ఈ పోటీలో చివరి బంతిని ఎదుర్కొన్న బుమ్రా 19 సంవత్సరాల రికార్డును సమం చేశాడు. 11వ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగిన బుమ్రా.. చివరి బంతిని సిక్సర్‌గా మలిచాడు. తద్వారా 2000వ సంవత్సరం ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే పోటీలో మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ కొట్టిన సిక్సర్ రికార్డును బుమ్రా సమం చేశాడు. ఇంకా వన్డే మ్యాచ్‌ల్లో బుమ్రా కొట్టి తొలి సిక్సర్ ఇదే కావడం గమనార్హం. 
 
బుమ్రా పాల్గొన్న 100 అంతర్జాతీయ పోటీలో బుమ్రా ఈ రికార్డును అధిగమించాడు. ఈ నేపథ్యంలో బుమ్రా సిక్సర్ ‌పెవిలియన్ నుంచి ఆకాశంలోకి ఎగిరడాన్ని చూసిన టీమిండియా కెప్టెన్ కోహ్లీతో పాటు సహ క్రికెటర్లు, క్రికెట్ ఫ్యాన్స్ చప్పట్లతో మైదానాన్ని మారుమోగేలా చేశారు. బుమ్రా సిక్సర్‌కు సంబంధించి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి స్వల్ప అస్వస్థత.. ఏమైందంటే? (video)

ఆలయంలోకి వచ్చాడని దళిత యువకుడిని నగ్నంగా ఊరేగించారు.. ఎక్కడ?

WAVES సమ్మిట్‌- ఏపీకి ఏఐ సిటీ.. రూ.10వేల కోట్లతో డీల్ కుదిరింది

AP: ఏపీలో మే 6 నుంచి జూన్ 13 వరకు ఆన్‌లైన్ ఎంట్రన్స్ పరీక్షలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

తర్వాతి కథనం
Show comments