Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో... వద్దు బాబోయ్ ట్రంప్... అమెరికాలో మున్నెన్నడూ లేని భయం ఎందుకు?

డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన దగ్గర్నుంచి అమెరికాలో నిరసన జ్వాలలు రగులుతూనే వున్నాయి. జనవరి 20, శుక్రవారం నాడు ఆయన అధ్యక్ష పదవీబాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ నేపధ్యంలో ఆయన ప్రమాణ స్వీకారోత్సవాన్ని బహిష్కరించాలంటూ పలు సంస్థలు పిలుపునివ్వడం చర్చన

Webdunia
మంగళవారం, 17 జనవరి 2017 (17:56 IST)
డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన దగ్గర్నుంచి అమెరికాలో నిరసన జ్వాలలు రగులుతూనే వున్నాయి. జనవరి 20, శుక్రవారం నాడు ఆయన అధ్యక్ష పదవీబాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ నేపధ్యంలో ఆయన ప్రమాణ స్వీకారోత్సవాన్ని బహిష్కరించాలంటూ పలు సంస్థలు పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. జనవరి 20న ట్రంప్ ప్రమాణాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేయాలని డిజరప్ట్‌ జె 20, బ్లాక్‌ లైవ్స్‌ మేటర్‌ తదితర సంస్థలతోపాటు పలు మానవ హక్కుల గ్రూపులు భావించడంతో ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి. 
 
ట్రంప్ మరో రెండు రోజుల్లో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనుండగా ఆయన ప్రమాణస్వీకారాన్ని బహిష్కరించాలనుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కాగా డెమోక్రాట్‌ సభ్యుడు లూయిస్‌తో సహా మరో 20 మందికి పైగా కాంగ్రెస్‌ సభ్యులు శుక్రవారం జరుగబోయే ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించాలని తీర్మానించారు. దీనిపై ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న మైక్‌పెన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అమెరికా పరువును బజారున పడవేయవద్దని విజ్ఞప్తి చేశారు. 
 
మరోవైపు నగరంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా వుండటంపై తిరుగుబాటు లేవనెత్తుతామని ఆందోళనలో పాల్గొనబోయే సంస్థలు ప్రకటిస్తున్నాయి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పనికిరారనీ, ఆయన దానికి అనర్హులంటూ వారు వాదిస్తున్నారు. కాగా గతంలో ట్రంప్ చేసిన ఘాటు వ్యాఖ్యలు, ఆయన వ్యవహార శైలితో కూడిన వీడియోలను వారు ప్రదర్శిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments