Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ నొప్పులకు ఈ నూనే భలే ఔషధం

Webdunia
గురువారం, 14 నవంబరు 2019 (23:16 IST)
కీళ్ల నొప్పులు వచ్చే ముందు కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. కీళ్ళు నొప్పి ఉన్న ప్రాంతంలో కందిపోయినట్లుగా కనిపించడం, వాచినట్లుగా ఉండి, వేడిగా ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే, ఈ నొప్పులతో బాధపడే వారు నీరసం, తలనొప్పి, ఆకలి లేకపోవడం, జ్వరంలాంటి లక్షణాలతో బాధపడుతుంటారు. 
 
ఇలాంటి నొప్పులు ఉన్నవారు.. కీళ్ళ మీద ఆవనూనెను ప్రతిరోజూ రెండు పూటలా మర్దన చేసినట్టయితే కొంతమేరకు ఉపశమనం కలిగిస్తుంది. అలాగే, సైంధవ లవణం ఒక స్పూను, దానిమ్మ చిగుళ్ళు కొంచెం కలిపి నూరి, చేసుకుని ఒక మాత్ర చొప్పున మూడు పూటలా తీసుకుంటే కీళ్ళ వ్యాధులు తగ్గిపోతాయని నాటు వైద్యులు చెపుతున్నారు. 
 
వీటితో పాటు.. మిరియాలు ఒక స్పూను, విషముష్టి గింజలు ఒక స్పూను ఈ రెండింటినీ అల్లం రసంలో మూడు రోజుల పాటు నాన బెట్టి, ఆ తర్వాత మెత్తగా మర్దన చేసి చిన్న చిన్న కంది గింజలంత మాత్రలు చేసుకుని ప్రతిరోజూ వేసుకుంటే అనేక రకాల కీళ్ళ వ్యాధులు తగ్గిపోతాయి. 
 
అలాగే, ఉల్లిపాయ, ఆవాలు సమ భాగాలుగా తీసుకుని బాగా నూరి నొప్పిగా ఉన్న కీళ్ళమీద మర్దన చేసుకుంటే వెంటనే నొప్పులు తగ్గుతాయి. నువ్వుల నూనె ఒక కప్పు, నాలుగు వెల్లుల్లిపాయ రేకులను చిన్న ముక్కలుగా చేసి నూనెలో వేసి బాగా మరగకాచి, చల్లార్చి ఆ నూనెను వడగట్టి కీళ్ళ నొప్పులున్న చోట మర్దన చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. 
 
ఇలా మర్దన చేయడం వల్ల కొందరికి కీళ్ళ నొప్పులు తగ్గకుండా నొక్కడం వల్ల ఇంకా బాధ పెరుగుతుంది. ఇటువంటి వారు నూనెను రాసుకుని కాపడం పెడితే చాలు. జీల్లేడు వేరు చూర్ణాన్ని వేప నూనెలో బాగా కలిపి మర్దన చేసుకుంటే కూడా నొప్పులు తగ్గిపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Jagan helicopter fiasco: జగన్ హెలికాప్టర్ ఇష్యూ- 10 వైకాపా కాంగ్రెస్ నేతలతో పాటు పది మంది అరెస్ట్

Heavy rains: ఏపీలో భారీ వర్షాలు: బాపట్లలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ఏపీకి రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఏపీడీఎంఏ-ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Bhagavad Gita: భగవద్గీత నుండి ప్రేరణ పొందిన రాబర్ట్ ఓపెన్ హైమర్.. అణు బాంబు?

10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయినా కేక్ కట్ చేసిన తల్లిదండ్రులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

తర్వాతి కథనం
Show comments