Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రీన్ టీ రోజుకు రెండు కప్పులే తాగాలి..

గ్రీన్ టీని రోజూ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. గ్రీన్ టీతో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. తద్వారా బరువు తగ్గొచ్చు. గుండె ఆరోగ్యానికి గ్రీన్ టీ ఎంతో మేలు చేస్తుంది. అయితే గ్రీన్ టీని ర

Webdunia
బుధవారం, 3 జనవరి 2018 (14:13 IST)
గ్రీన్ టీని రోజూ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. గ్రీన్ టీతో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. తద్వారా బరువు తగ్గొచ్చు. గుండె ఆరోగ్యానికి గ్రీన్ టీ ఎంతో మేలు చేస్తుంది. అయితే గ్రీన్ టీని రోజుకు రెండు కప్పులు వరకే తీసుకోవాలి. లేకుంటే గ్యాస్, అసిడిటీ సమస్యలు తప్పవు. అలాగే గ్రీన్ టీని ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత లేకుంటే మధ్యాహ్నం భోజనం తీసుకున్నా గంట తర్వాత తీసుకోవాలి. 
 
అదే అల్పాహారానికి ముందు, ఆహారం తీసుకునేందుకు ముందు తీసుకుంటే మనం తీసుకునే ఆహారంలోని పోషకాలు శరీరానికి పట్టవు. అందుకే ఆహారం తీసుకున్న గంటకు తర్వాత గ్రీన్ టీ తాగడం మంచిది. కానీ రెండు కప్పుల కంటే అధికంగా గ్రీన్ టీ సేవిస్తే.. శరీరంలోని కీలక పోషకాలు తొలగిపోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక నిద్రలేమి సమస్య ఉన్న వారు సాయంత్రం ఆరు గంటల తర్వాత గ్రీన్ టీ తాగకూడదు. ఎందుకంటే ఇందులో ఉండే కెఫీన్ నిద్ర సరిగ్గా పట్టకుండా చేస్తుందని వైద్యులు చెప్తున్నారు. 
 
గ్రీన్ టీని రోజూ తాగితే గుండె సంబంధ స‌మ‌స్య‌లు రావు. ర‌క్త స‌రఫ‌రా మెరుగు ప‌డుతుంది. మ‌ధుమేహం ఉన్న‌వారు గ్రీన్ టీ తాగితే వారి శరీరంలోని చక్కెర స్థాయిలు తగ్గుముఖం పడుతాయి. గ్రీన్ టీని రోజూ ఉద‌యం, సాయంత్రం తాగ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి. అయితే రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువగా గ్రీన్ టీ తీసుకోకూడదు
 
ర‌క్త‌హీన‌తతో బాధ‌ప‌డేవారు కూడా గ్రీన్ టీ తాగ‌కూడ‌దు. ఎందుకంటే గ్రీన్ టీ వ‌ల్ల శ‌రీరం ఆహారంలో ఉండే ఐర‌న్‌ను ఎక్కువ‌గా గ్ర‌హించ‌దు. హై బీపీ ఉన్న‌వారు కూడా గ్రీన్ టీ తాగ‌కూడ‌దు. ఎందుకంటే ర‌క్త‌స‌ర‌ఫ‌రా ఎక్కువ‌గా అవ‌డం వ‌ల్ల బీపీ ఇంకా పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది. గ‌ర్భిణీ మహిళలు, పిల్లలు గ్రీన్ టీకి దూరం వుండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

తర్వాతి కథనం
Show comments