Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉసిరి జ్యూస్‍‌తో ఎంతో మేలు.. ఎలా చేయాలో వీడియోలో చూడండి..

ఉసిరికాయలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఉసిరికాయ జ్యూస్ తాగితే అనారోగ్యాలు దరిచేరవు. ఆమ్లాలోని పోషకాలు చర్మంలోని కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించి.. నిత్యయవ్వనులుగా మిమ్మల్ని వుంచుతుంది. ఆమ్లా జ్యూస్ చర్మ

Webdunia
సోమవారం, 9 జులై 2018 (14:55 IST)
ఉసిరికాయలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఉసిరికాయ జ్యూస్ తాగితే అనారోగ్యాలు దరిచేరవు. ఆమ్లాలోని పోషకాలు చర్మంలోని కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించి.. నిత్యయవ్వనులుగా మిమ్మల్ని వుంచుతుంది. ఆమ్లా జ్యూస్ చర్మానికి మంచి టోనర్‌గా పనిచేస్తుంది. మీరు ఎప్పుడూ ఫిట్‌గా ఉండాలని బరువు తగ్గాలనుకుంటున్నవారైతే.. ఉసిరి జ్యూస్ తాగాల్సిందే. 
 
ప్రతిరోజూ పరగడుపున ఆమ్లా జ్యూస్ తాగితే శరీరంలో ప్రోటీన్ మెటబాలిజంను పెంచుకోవచ్చు. తద్వారా బరువు సులభంగా తగ్గొచ్చు. ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఒక గ్లాసు ఆమ్లా జ్యూస్ తాగడం ద్వారా కేశ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఇంకా జుట్టు నెరవదు. చుండ్రు ఇట్టే మాయమవుతుంది.
 
అలాగే చర్మానికి ఆమ్లా జ్యూస్ మెరుగునిస్తుంది. ఈ జ్యూస్‌తో జీర్ణక్రియ మెరుగవుతుంది. ఆమ్లాలోని పోషకాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఉసిరిలో విటిమన్ సి పుష్కలంగా ఉంది. ఇది చర్మం ఛాయను మెరుగుపరిచే కొల్లాజెన్ సెల్స్‌ను చర్మంలోపల ఉత్పత్తిని పెంచుతుంది. ఇలా బోలెడు ప్రయోజనాలున్న ఉసిరి కాయను సింపుల్‌గా ఎలా ట్రై చేయాలో చూద్దాం...
 
ఉసిరిలోని మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు.. 
కొవ్వుకు చెక్ పెట్టొచ్చు 
ఆస్తమాను దూరం చేసుకోవచ్చు.  
మొలల వ్యాధిని నియంత్రించవచ్చు. 
గ్యాస్ట్రిక్ సమస్యలు మటాష్ అుతాయి. 
కంటి దృష్టిని మెరుగుపరుచుకోవచ్చు. 
గుండెకు మేలు చేస్తుంది
మధుమేహాన్ని నియంత్రిస్తుంది. 
క్యాన్సర్‌పై పోరాడుతుంది. 
ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 
మహిళల్లో నెలసరి సమస్యలు, ఇన్ఫెక్షన్లు దరిచేరవు.
 
జ్యూస్ ఎలా చేయాలి. 
ముందుగా ఉసిరికాయలను కట్ చేసుకోవాలి. 
అలా కట్ చేసుకున్న ఉసిరి ముక్కలను మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. 
గ్రైండ్ చేసుకున్న ఉసిరి మిశ్రమానికి కాసింత నీరు చేర్చి.. వడగట్టుకోవాలి. 
అలా వడగట్టుకుని ఆమ్లా రసాన్ని గ్లాసులోకి తీసుకుని.. చిటికెడు ఉప్పు, అర చెక్క నిమ్మరసం, ఒక స్పూన్ పంచదార చేర్చి తీసుకోవాలి. అంతే ఆమ్లా జ్యూస్ రెడీ. ఈ సింపుల్ రిసిపీ రోజూ ఉదయం ట్రై చేయండి.. సులభంగా బరువు తగ్గండి.. ఆరోగ్య ప్రయోజనాలు పొందండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Vidadala Rajini: విడదల రజినికి మరో ఎదురుదెబ్బ- అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ (video)

My Sindoor to Border: పెళ్లైన మూడు రోజులే. నా సింధూరాన్ని సరిహద్దులకు పంపుతున్నా..

Asaduddin Owaisi: పాకిస్తాన్ మజాక్ చేస్తుంది.. భారత్ కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం.. ఓవైసీ (video)

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

తర్వాతి కథనం
Show comments