Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బే ఛీ.. ఛీ.. విమానంలో ఇలా చేసిందేమిటి? (వీడియో)

విమానాల్లో చోటుచేసుకునే ఫన్నీ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా విమానంలో ఓ ప్రయాణీకురాలు.. తోటి ప్రయాణీకులు చీదరించే పనిచేసి సోషల్ మీడియాకెక్కింది. ఇంతకీ ఏం చేసిందంటే.. టర్

Webdunia
గురువారం, 22 ఫిబ్రవరి 2018 (14:34 IST)
విమానాల్లో చోటుచేసుకునే ఫన్నీ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా విమానంలో ఓ ప్రయాణీకురాలు.. తోటి ప్రయాణీకులు చీదరించే పనిచేసి సోషల్ మీడియాకెక్కింది. ఇంతకీ ఏం చేసిందంటే.. టర్కీలోని అంటల్యా నుంచి మాస్కోకు యూరల్ ఎయిర్‌లైన్స్ విమానం వెళ్తుండగా.. ఓ మహిళా ప్రయాణీకురాలు.. తన బ్యాగు నుంచి అండర్‌వేర్‌ను బయటికి తీసింది. 
 
అంతటితో ఆగలేదు.. దాన్ని పైకెత్తి.. సీటుపైన వున్న ఏసీ గాలి తగిలేలా పట్టుకుంది. అండర్ వేర్ తడిగా వుండటంతో ఆరబెట్టేందుకు ఆమె అలా చేసింది. దీన్ని చూసిన ప్రయాణీకులంతా షాక్ అయ్యారు. కానీ వెనుక సీట్లో వున్న ఓ వ్యక్తి దీన్ని రికార్డు చేసి.. విమానం దిగాక ఓ వెబ్ సైటుకు ఇచ్చాడు. ఇక వాళ్లు దాన్ని యూట్యూబ్‌లో పోస్టు చేశారు. అంతే గంటల్లోనూ ఈ వీడియో వైరల్ అయ్యింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments