Webdunia - Bharat's app for daily news and videos

Install App

Amrita Iyer : యాక్షన్ రోల్స్ చేయడం ఇష్టమే : అమృత అయ్యర్

డీవీ
బుధవారం, 11 డిశెంబరు 2024 (15:32 IST)
Amrita Iyer
హీరో అల్లరి నరేష్ అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బచ్చల మల్లి'. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలై టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. బచ్చల మల్లి డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అమృత అయ్యర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
 
- హనుమాన్ షూట్ చేస్తున్నపుడు ఈ కథ విన్నాను. స్క్రిప్ట్, క్యారెక్టర్ చాలా నచ్చింది. ఇందులో క్యారెక్టర్ కి కథలో చాలా ఇంపార్టెన్స్ వుంది. 
 
- ఇందులో 80sలో బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ ఇది. టౌన్ అమ్మాయి అయినప్పటికీ సిటీ కల్చర్ వున్న క్యారెక్టర్ లో కనిపిస్తాను. తను చాలా సెన్సిటివ్, వెరీ ఎమోషనల్ క్యారెక్టర్. ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే అమ్మాయి. ఇందులో నాకు, నరేష్ గారి మధ్య మంచి ఎమోషనల్ సీన్స్ వున్నాయి. ఇప్పటివరకూ నేను చేసిన క్యారెక్టర్స్ కి డిఫరెంట్ గా ఉంటుంది.   
 
- నరేష్ గారు అద్భుతమైన యాక్టర్. ఎలాంటి ఎమోషనైనా పండించగలరు. అన్ స్క్రీన్ అగ్రీసివ్ క్యారెక్టర్ వుంటుంది. కానీ అఫ్ స్క్రీన్ ఆయన చాలా సాఫ్ట్ పర్శన్. చాలా ఫ్రెండ్లీ. ఆయనతో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్ పీరియన్స్. 
 
 - మొదటి నుంచి మీనింగ్ ఫుల్ క్యారెక్టర్స్ చేయాలనేదే నా ఆలోచన. బచ్చలమల్లి లో కూడా చాలా మంచి పాత్ర. చాలా మంచి ఎమోషన్స్, కంటెంట్ వున్న సినిమా ఇది. తప్పకుండా మంచి హిట్ అవుతుంది.        
 
- డైరెక్టర్ సుబ్బు గారు చాలా క్లియర్ విజన్ వున్న డైరెక్టర్. చాలా ఫోకస్ గా వుంటారు. ఎమోషన్స్ ని చాలా అద్భుతంగా తీశారు.  బచ్చల మల్లి ఎమోషనల్ డ్రామా. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. 
 
- సీతారామం ఫేం విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమా మ్యూజిక్. ఆయన మ్యూజిక్ ఇస్తున్నారగానే చాలా ఆనందంగా అనిపించింది. ఇందులో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. సినిమా రిలీజ్ తర్వాత మరింతగా కనెక్ట్ అవుతాయి.
 
- నిర్మాత రాజేష్ దండా గారితో ఇదివరకే  ఓ సినిమా చేయాలి. కానీ అది కుదరలేదు. ఫైనల్ గా ఈ సినిమాలో పని చేయడం చాలా ఆనందంగా అనిపించింది. సినిమా అంటే చాలా పాషన్ వున్న ప్రొడ్యూసర్. వారి ప్రొడక్షన్ లో వర్క్ చేయడం చాలా హ్యాపీగా వుంది. ఈ మూవీ జర్నీ చాలా స్మూత్ గా జరిగింది.
 
-  డ్రీం రోల్స్ ఏమిటంటే.. డ్రీమ్ గర్ల్, క్వీన్, ప్రిన్సెస్ రోల్స్ చేయాలని వుంది. యాక్షన్ రోల్స్ చేయడం కూడా ఇష్టమే.
 
- నెక్స్ట్ఓ   కన్నడ, తమిళ్ సినిమా చేస్తున్నాను. తెలుగులో స్క్రిప్ట్స్ వింటున్నాను.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాలో అమ్మాయి పెళ్లి.. సూర్యాపేటలో వీడియో కాల్ ద్వారా ఆశీర్వదించిన తల్లిదండ్రులు (video)

ప్రపంచం తడబడుతోంది.. కానీ భారత్ దూసుకెళుతోంది : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

చంబా జిల్లాలో ఆకస్మిక వరదలు - చున్నీతో బైకర్‌ను రక్షించిన నవ వధువు (Video)

పెళ్లికి నిరాకరించిన నర్సింగ్ విద్యార్థినిని 11 సార్లు కత్తితో పొడిచి చంపిన ప్రేమోన్మాది, వీడియో

వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారిన విజయ సాయి రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి తీసుకుంటే?

మహిళలు - చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా మా కావేరీ స్పెషాలిటీ ఆస్పత్రి

మధుమేహం వున్నవారు పిస్తా పప్పులు తినవచ్చా?

చెన్నై కుమరన్ ఆస్పత్రిలో 20 గంటల మారథాన్ ఆపరేషన్ విజయవంతం

ప్రతిరోజూ 10 బాదం పప్పులు తిని చూడండి

తర్వాతి కథనం
Show comments