మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. వారంలో 3 రోజులు వీకాఫ్

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (10:39 IST)
మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో ఏ కార్పొరేట్ కంపెనీ చేయని సాహసాన్ని మైక్రోసాఫ్ట్ చేసింది. ఉద్యోగులకు మూడు రోజుల పాటు వీకాఫ్‌ను ప్రకటించింది. ఈ మేరకు జపాన్‌లోని మైక్రోసాఫ్ట్ కంపెనీ 2,300 మంది ఉద్యోగులకు మూడు రోజులు వీకాఫ్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు కారణాలేంటంటే.. చాలామంది ఉద్యోగులు, కుటుంబ సభ్యులతో గడిపే సమయం తక్కువగా వుందట. 
 
ఉద్యోగం అంటూ పనిలోనే మునిగిపోతూ.. కుటుంబ సభ్యులతో కొన్ని గంటలు మాత్రమే గడుపుతున్నారని తెలిసింది. ఈ విధానం ద్వారా మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయని గ్రహించిన మైక్రోసాఫ్ట్ మేనేజ్‌మెంట్, వారంలో మూడు రోజులు వీకాఫ్ ఇస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించింది. అందులో భాగంగా వర్కింగ్ రిఫార్మ్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ప్రారంభించి, తమ ఉద్యోగులకు శుక్ర, శని, ఆదివారం వీకాఫ్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇక్కడ మీకో డౌట్ రావొచ్చు. 
 
వీకాఫ్‌లు పెంచితే వర్క్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది కదా అని. అంత లేదు. ఇది వరకటి కంటే... ఇప్పుడు జపాన్ మైక్రోసాఫ్ట్‌లో వర్క్ ప్రొడక్షన్ 39.9 శాతం పెరిగింది. ఇదిలా ఉంటే... ఇదివరకు మైక్రోసాఫ్ట్‌లో రోజూ ఏవో ఒక మీటింగ్‌లు, చర్చలు పెట్టుకునేవాళ్లు. ఇప్పుడు టైమ్ లేదన్న ఉద్దేశంతో అలాంటి వాటిని పక్కన పెట్టి పని చేస్తున్నారట.

తప్పనిసరైతే వాట్సాప్ వీడియో కాల్ లాంటి వాటిలో వర్చువల్ మీటింగ్స్ పెట్టుకొని టైమ్ సేవ్ చేసుకుంటున్నారు. టీ, కాఫీ అంటూ మాటిమాటికీ బయటకు వెళ్లకుండా బుద్ధిగా పని చేసుకుంటున్నారు. అందువల్ల పని త్వరగా అయిపోవడమే కాదు. కంపెనీ వాడుతున్న ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా తగ్గుతోందట. 
 
ఈ ఆలోచన సక్సెస్ అవ్వడంతో దీన్ని కంటిన్యూ చెయ్యడానికి మైక్రోసాఫ్ట్ ప్లాన్స్ వేస్తోంది. అదే జరిగితే ఎల్లప్పుడూ వారంలో 3 రోజులు వీకాఫ్స్ ఇస్తే ప్రపంచవ్యాప్తంగా మిగతా కంపెనీలు కూడా ఇదే రూట్ ఫాలో అయ్యే అవకాశాలున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Priyadarshi: ప్రియదర్శి, సాయి కుమార్ ల సుయోధన చిత్రం సిద్ధమైంది

Allu Arjun 23: అల్లు అర్జున్ 23 చిత్రం స్పెషల్ థీమ్ సాంగ్ ర్యాంపేజ్

పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసుకుని విడుదలకి సిద్ధమైన సందిగ్ధం

Mark K Robin: గద్దర్ పాటలు కాదు ఫైర్ - ఆయన పేరుతో అవార్డు రావడం ఆనందంగా వుంది : మార్క్ కె రాబిన్

గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా హర్షిత్ రెడ్డి దీవాన మూవీ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కడుపులో మంటగా ఉందా?

షార్లెట్‌లో నాట్స్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

నెలసరి సమయంలో కడుపునొప్పి, తగ్గించే చిట్కాలు

కుండనీరు తాగితే ఏంటి లాభం.. తెలుసుకుందామా?

వేసవిలో గర్భిణీస్త్రీలు ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments