పశ్చిమబెంగాల్: కోలాఘాట్‌లో ఐదేళ్ల బాలికపై 14ఏళ్ల బాలుడి అత్యాచారం

సెల్వి
శుక్రవారం, 24 అక్టోబరు 2025 (22:22 IST)
పశ్చిమ బెంగాల్‌లో ఐదేళ్ల బాలికపై అఘాయిత్యం జరిగింది. పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని కోలాఘాట్‌లో ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు 14 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై జువెనైల్ జస్టిస్ యాక్ట్, 2015లోని కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
 
వివరాల్లోకి వెళితే.. బాధితురాలు తనపై జరిగిన లైంగిక నేరం గురించి తన తల్లిదండ్రులతో సహా ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని నిందితుడిపై మరిన్ని అభియోగాలు ఉన్నాయి.
 
బాధితురాలు అక్టోబర్ 22 ఉదయం నిందితుడి ఇంటికి వెళ్లినట్లు తెలిసింది. బాధితురాలి తల్లిదండ్రులు దాఖలు చేసిన పోలీసు ఫిర్యాదు ప్రకారం, ఇంట్లో ఇతర కుటుంబ సభ్యులు లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని నిందితుడు తన కుమార్తెను తన నివాసంలోనే అత్యాచారం చేశాడు.
 
ఈ విషయం తెలిసి బాధితురాలి తల్లిదండ్రులు ముందుగా నిందితుడి ఇంటికి వెళ్లి జరిగిన మొత్తం సంఘటనను నిందితుడి తల్లిదండ్రులకు వివరించారు. కానీ వారు పట్టించుకోకుండా బాధితురాలి తల్లిదండ్రులపై దాడి చేశారు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు స్థానిక కోలాఘాట్ పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై అధికారిక ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి చివరకు నిందితుడిని అరెస్టు చేశారు. 
 
తన కుమార్తె నిందితుడి బెదిరింపులకు భయపడిందని.. కానీ ఆమెకు కడుపులో నొప్పి రావడంతో జరిగిందంతా చెప్పిందని బాధితురాలి తల్లిదండ్రులు తెలిపారు. ఈ ఘటనలో నిందితుడికి అత్యంత కఠినమైన శిక్ష విధించాలని బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం