Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరిన బాలుడు.. పొట్టలో 56 వస్తువులు..

ఠాగూర్
సోమవారం, 4 నవంబరు 2024 (12:37 IST)
కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరిన ఓ బాలుడు కడుపులో వైద్యులు ఏకంగా 56 వస్తువులను గుర్తించారు. ఈ ఆశ్చర్యకర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్‌లో వెలుగు చూసింది. అయితే, ఆ బాలుడుకి ఆపరేషన్ చేసి కడుపులోని వస్తువులన్నీ బయటకు తీశారు. అయితే, వైద్యులు ఎంతగా కృషి చేసినా ఆ బాలుడు ప్రాణాలను మాత్రం నిలబెట్టలేకపోయారు. 
 
హత్రాస్‌కు చెందిన 15 యేళ్ల బాలుడు ఆదిథ్య స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుకున్నాడు. కొంతకాలంగా ఆ కుర్రాడు కడుపునొప్పితో బాధపుడుతున్నాడు. ఈ రోజు రోజుకూ నొప్పి తీవ్రతరం కావడంతోపాటు ఊపిరి ఆడకపోవడంతో తల్లిదండ్రులు ఆదిత్యను ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు స్కానింగ్ చేసి చూడగా అతని పొట్టలో వివిధ వస్తువులు కనిపించాయి. వెంటనే ఆపరేషన్ చేసి కడుపులో నుంచి ఏకంగా 56 రకాలై వస్తువులను వెలికి తీశారు. 
 
వీటిలో బ్యాటరీలు, బ్లేడ్‌లు, మొలలు, గోర్లతో పాటు చిన్న చిన్న ఇనుప వస్తువులు ఉన్నాయి. ఇవన్నీ ఆదిత్య నోటితో మింగాడని వైద్యులు భావిస్తున్నారు. అయితే, ఆదిత్య గొంతుకు కానీ, ప్రేగులకు గానీ ఎలాంటి గాయం కాకపోవడంతో వారు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఆదిత్యను కాపాడేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని వైద్యులు తెలిపారు. ఈ నెల 27వ తేదీన ఢిల్లీలోని సప్థర్ జంగ్ ఆస్పత్రిలో ఆదిత్యకు ఆపరేషన్ చేయగా, ఆ మురసటి రోజు ఆదిత్య చనిపోయాడని తల్లిదండ్రులు వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments