Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

ఠాగూర్
గురువారం, 26 జూన్ 2025 (22:24 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్‌లో దారుణం జరిగింది. ఆర్కెస్ట్రాలో డ్యాన్సర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ వివాహం చేసుకున్నందుకు కన్నతల్లి, తోబుట్టువులు, సోదరుడు కలిసి కర్రలతో కొట్టి చంపేశారు. ఈ దాడిలో మృతుడి భార్య కూడా తీవ్రంగా గాయపడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
30 యేళ్ల అమిత్ గత 2022లో ఆర్కెస్ట్రా డ్యాన్సర్ అయిన అనితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లిని అమిత్ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా, తల్లి మీరా దేవి, తోబుట్టువులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఆ జట్టు ఢిల్లీకి వెళ్లి నివాసం ఉంటోంది. 
 
రెండు సంవత్సరాల తర్వాత బుధవారం సాయంత్రం తన భార్య అనితతో కలిసి తన స్వగ్రామంలోని కుటుంబం ఇంటికి తిరిగివచ్చాడు. ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా అతని తల్లి, సోదరీమణులు వారిని అడ్డుకోవడంతో వాగ్వాదం మొదలైంది. ఈ ఘర్షణ సాయంత్రం మరింత తీవ్రరూపం దాల్చింది. అమిత్ తల్లి మీరా దేవి, ఇద్దరు సోదరీమణులు, ఒక సోదరుడు కలిసి కర్రలు, రాడ్లతో అనితపై దాడి చేయడంతో అమిత్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అడ్డుకోబోయిన అనితపై కూడా వారు దాడి చేశారు. 
 
దీంతో ఆమెకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అమిత్, అనితలను కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అయితే, మార్గమధ్యంలోనే అమిత్ ప్రాణాలు కోల్పోయాడు. అనితను మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నలుగురు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్షవర్ధన్ షాహాజీ షిండే- కొత్తదారులు చూపుతున్న యువ పారిశ్రామికవేత్త

తెలుగు సినిమా కోసం కపిల్ శర్మ ఆడిషన్‌ చేస్తున్నారా?

Karishma Sharma: ముంబై లోకల్ రైలు నుంచి దూకిన బాలీవుడ్ నటి కరిష్మా శర్మ

Lavanya: లావణ్య త్రిపాఠి కి అభినందనలు - అథర్వ మురళి టన్నెల్ మూవీ వాయిదా

లిటిల్ హార్ట్స్ మూవీకి సపోర్ట్ చేస్తూ ప్రోత్సాహం అందిస్తున్న స్టార్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coconut Milk: జుట్టు ఆరోగ్యానిరి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

తర్వాతి కథనం
Show comments