Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్కర్లో ఇరుక్కుపోయిన బాలుడి తల.. ఒక్క రూపాయే తీసుకున్నారు..

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (14:45 IST)
గతంలో ఓ బాలుడి తల వంట సామానులో చిక్కుకున్న వార్త వైరల్ అయ్యింది. తాజాగా పొరపాటున చిన్నారి తల ప్రెజర్‌ కుక్కర్‌లో ఇరుక్కుపోయింది. తల కుక్కర్లో ఇరుక్కుపోవడంతో ఆ చిన్నారి నానా తంటాలు పడ్డాడు. 
 
దీంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు తలను బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో తల బయటకు వచ్చేలా ప్రయత్నాలు చేశారు. అయినా ఫలించలేదు. ఇలా కాదని వెంటనే ఆస్పత్రికి పరుగున వెళ్లారు. వైద్యులు మొదట ఆశ్చర్యానికి గురయి అనంతరం అత్యంత జాగ్రత్తతో కుక్కర్‌ను తొలగించి చిన్నారి తలను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు.  
 
వివరాల్లోకి వెళితే.. ఆగ్రా లోహమండి ప్రాంతంలోని ఖటిపరాలో ఉన్న మేనమామ ఇంటికి కుటుంబసభ్యులు వచ్చారు. తమతోపాటు 18 నెలల చిన్నారిని వెంట తీసుకున్నారు. ఇంట్లో అందరూ తమ పనుల్లో మునిగి ఉండగా ఈ చిన్నారి ఆడుకుంటున్నాడు. 
 
ఈ సమయంలో అక్కడే ఉన్న ప్రెజర్‌ కుక్కర్‌తో ఆడుకుంటుండగా పొరపాటున తల కుక్కర్‌లో ఇరుక్కుపోయింది. వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించారు. 
 
అతికష్టమ్మీద దాదాపు రెండున్నర గంటలపాటు శ్రమించి విజయవంతంగా చిన్నారి తలను బయటకు తీశారు. ఈ చికిత్సకు వైద్యులు ఒక్క రూపాయి మాత్రమే ఫీజుగా తీసుకోవడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో హీరో నాగార్జున సందడి!

Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments