Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలితకు వారసులున్నారుగా.. దీప, దీపక్‌ల సంగతేంటి? హైదరాబాద్ ఆస్తులపై హైకోర్టు సీరియస్

అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలితకు వారసులు లేకపోవడంతో హైదరాబాదులోని అమ్మ ఆస్తులను తెలంగాణ సర్కారు స్వాధీనం చేసుకోవాలని ఓ పిటీషన్ దాఖలైన సంగతి తెలిసిందే. కాగా, జయలలితకు హైదరాబాద్‌లోని జ

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2016 (11:50 IST)
అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలితకు వారసులు లేకపోవడంతో హైదరాబాదులోని అమ్మ ఆస్తులను తెలంగాణ సర్కారు స్వాధీనం చేసుకోవాలని ఓ పిటీషన్ దాఖలైన సంగతి తెలిసిందే. కాగా, జయలలితకు హైదరాబాద్‌లోని జీడిమెట్లలో ఫాంహౌస్‌, శ్రీనగర్‌ కాలనీలో బహుళ అంతస్థుల భవనం ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో హైకోర్టు తీవ్రంగా స్పందించింది. వారసులు లేని కారణంగా జయమ్మ ఆస్తులను తెలంగాణ సర్కారు స్వాధీనం చేసుకోవాలని గరీబ్‌గైడ్‌ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
అంతేకాదు ఇలాంటి పిటిషన్ వేసినందుకు సదరు వ్యక్తికి ఏకంగా లక్ష రూపాయల జరిమానా విధించింది హైదరాబాద్ హైకోర్టు. జయలలిత మరణించి 15 రోజులు కూడా గడవకముందే ఇలాంటి పిటిషన్లు వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, జయకు సోదరుడు ఉన్నందున ఆమెకు వారసులు లేరని ఎలా అంటారని హైకోర్టు ప్రశ్నించింది. జయ సోదరుడికి ఒక కొడుకు, ఒక కూతురు ఉందని పేర్కొన్న హైకోర్టు.. హిందూ చట్టం ప్రకారం ఆమె ఆస్తులు వారికే చెందుతాయని స్పష్టం చేసింది.
 
నాలుగు వారాల్లోగా జరిమానా చెల్లించాలని తీర్పు చెబుతూ పిటిషన్ కొట్టివేసింది. జరిమానా చెల్లించకుంటే తెలంగాణ ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇలాంటి పిటిషన్లు వేయడం వల్ల కోర్టు సమయం వృదా అవుతోందని, గందరగోళ పరిస్థితి ఏర్పడుతుందని హైకోర్టు ఫైర్ అయ్యింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments