Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ పనిబట్టిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి!!

ఠాగూర్
సోమవారం, 12 మే 2025 (13:27 IST)
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై భీకర దాడులు జరిపింది. ఈ దాడులను అడ్డుకునేందుకు పాకిస్థాన్ దుస్సాహసానికి పాల్పడింది. దీంతో భారత్ సైనిక బలగాలు మరింతగా రెచ్చిపోయాయి. పాకిస్థాన్ భూభాగానికి వెళ్లి భీకర దాడులు చేశాయి. ముఖ్యంగా, పాకిస్థాన్ సైనిక స్థావరాలు, వైమానిక దళాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయి. ఈ దాడుల్లో పాకిస్థాన్‌కు అపార నష్టం వాటిల్లింది. ఈ దాడుల కోసం భారత్ హ్యామర్ గైడెడ్ బాంబులు, స్కాల్ప్ క్షిపణులతో పాటు బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని కూడా ఉపయోగించినట్లు సమాచారం.
 
భారత్ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ, బ్రహ్మోస్ క్షిపణి వల్లనే పాక్ వైమానిక స్థావరాలు తీవ్రంగా ధ్వంసమైనట్టు భావిస్తున్నారు. జాతీయ మీడియా కథనాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. యుద్ధరంగంలో బ్రహ్మోస్ క్షిపణిని భారత్ ఉపయోగించడం ఇదే మొదటిసారి కావచ్చని అభిప్రాయపడుతున్నారు.
 
పాకిస్థాన్ వైమానిక స్థావరాలపై భారత్ దాడికి ముందు, పాకిస్థాన్ ఒక బాలిస్టిక్ క్షిపణిని హర్యానాలోని సిర్సాపైకి ప్రయోగించింది. దీంతో ఆగ్రహించిన భారత్ అత్యాధునిక ఆయుధాలతో పాక్ వైమానిక స్థావరాలపై విరుచుకుపడినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు అణు యుద్ధానికి దారితీస్తాయన్న ఆందోళనతో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రుబియో రంగంలోకి దిగి కాల్పుల విరమణ కోసం పాక్ అత్యవసరంగా చర్చలు జరిపినట్లు సమాచారం.
 
పాకిస్థాన్ అధికారిక రాజధాని ఇస్లామాబాద్ అయినప్పటికీ, పాలన మొత్తం రావల్పిండి నుంచే జరుగుతుంది. రావల్పిండిలోని చక్లాలా ఆర్మీ చీఫ్ కార్యాలయం నుంచే ఆదేశాలు వెళుతుంటాయి. శనివారం తెల్లవారుజామున పాకిస్థాన్‌లోని ఈ కీలక ప్రాంతాన్ని భారత్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. చక్లాలాలో పాక్ వాయుసేనకు చెందిన మొబిలిటీ కమాండ్ ఉంది. దీనితో పాటు గగనతల రిఫ్యూయలింగ్ ట్యాంకర్ ఫైటర్లు, హెవీ లిఫ్టర్లు అక్కడ ఉన్నాయి. 
 
ఈ దాడుల్లో వైమానిక స్థావరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, రాదార్ సైట్లు, ఆయుధ నిల్వ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. భారత్ నిమిషాల వ్యవధిలో పాకు చెందిన కీలక వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడంతో ఆ దేశం తీవ్ర ఆందోళనకు గురైంది. దీంతో అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు పాక్ అంగీకరించినట్లు తెలుస్తోంది. పాక్ ను తీవ్రంగా దెబ్బతీసిన బ్రహ్మోస్ క్షిపణిని భారత్, రష్యా కలిసి అభివృద్ధి చేశాయి. ఇది ప్రపంచంలోనే శక్తివంతమైన క్రూయిజ్ క్షిపణిగా గుర్తింపు పొందింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal helth: హీరో విశాల్ ఆరోగ్యంపై విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ వివరణ

Tarak: కళ్యాణ్ రామ్, ఎన్.టి.ఆర్. (తారక్) పేర్లు ప్రస్తావించిన పురందేశ్వరి

Rajasaheb: ప్రభాస్ రాజాసాబ్ కీలక అప్ డేట్ - కీసరలో రీషూట్స్ !

పోస్టర్ తో ఆసక్తికలిగించిన సుధీర్ బాబు హీరోగా చిత్రం

CULT: రచయిత, హీరోగా, దర్శకుడిగా విశ్వక్సేన్ చిత్రం కల్ట్ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments