Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను హత్యచేసి 50 ముక్కలుగా నరికాడు.. ఎందుకంటే?

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (15:54 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో తన భార్యను ఓ భర్త హత్య చేసి 50 ముక్కలుగా నరికిన ఘటన సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. దిల్సర్ అన్సారీ జార్ఖండ్‌లోని సకీబ్‌గంజ్ జిల్లాలోని బోరియో నివాసి. అతనికి అప్పటికే వివాహమై, ఆ ప్రాంతానికి చెందిన రూబికా బగాదిన్ అనే 22 ఏళ్ల గిరిజన యువతితో వివాహేతర సంబంధం ఉంది. 
 
రెండేళ్లుగా ఇద్దరూ పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్నారు. ఈ కేసులో రూబికా కనిపించడం లేదని దిల్సర్ అన్సారీ ఇటీవల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రూబికా తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేశారు. కానీ అన్సారీపై వారికి అనుమానం కలిగింది. 
 
ఇదిలా వుంటే సంతాలి గ్రామంలో నిర్మిస్తున్న అంగన్‌వాడీ కేంద్రంలో కుక్క మానవ శరీర భాగాన్ని తినేస్తున్నట్లు స్థానికులు చూశారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించగా.. ఆ భవనంలో 12 శరీర భాగాలు కనిపించాయి. విచారణలో అది రూబికా శరీర భాగాలని తేలింది. 
 
దీంతో అన్సారీపై అనుమానం వచ్చి పోలీసులు తీవ్రంగా విచారించగా.. రూబికాను హత్య చేసి 50 ముక్కలుగా నరికి తానేనని అన్సారీ అంగీకరించాడు. అన్సారీని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

మరో మెగా వారసుడు రానున్నాడా? తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ - లావణ్య

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

సూర్య, పూజా హెగ్డే నటించిన రెట్రో సమీక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments