Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత మరణం గోప్యం బాధాకరం.. శూన్యంలోకి రాజకీయాలు: శశికళ పుష్ప

తమిళనాడు సీఎం జయలలిత మృతితో తమిళనాట రాజకీయాలు శూన్యంలోకి వెళ్ళిపోయానని అన్నాడీఎంకే నుంచి ఉద్వాసన గురైన రాజ్య‌స‌భ సభ్యురాలు శ‌శిక‌ళా పుష్ప అన్నారు. అమ్మ మృతిపై నెల‌కొన్న అనుమానాలు త్వ‌ర‌లో నివృత్తి అవు

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2016 (11:13 IST)
తమిళనాడు సీఎం జయలలిత మృతితో తమిళనాట రాజకీయాలు శూన్యంలోకి వెళ్ళిపోయానని అన్నాడీఎంకే నుంచి ఉద్వాసన గురైన రాజ్య‌స‌భ సభ్యురాలు శ‌శిక‌ళా పుష్ప అన్నారు. అమ్మ మృతిపై నెల‌కొన్న అనుమానాలు త్వ‌ర‌లో నివృత్తి అవుతాయ‌ని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే వ్య‌వ‌స్థాప‌కుడు ఎంజీఆర్ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని శ‌నివారం ఆమె మెరీనా బీచ్‌లోని ఆయ‌న స‌మాధి వ‌ద్ద నివాళులు అర్పించారు. 
 
ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ జ‌య‌ల‌లిత ఆస్ప‌త్రిలో చేరిన ద‌గ్గ‌ర నుంచి ఆమె మ‌ర‌ణం వ‌ర‌కు అంతా గోప్యంగా ఉండ‌డం బాధాక‌ర‌మైన విష‌య‌మ‌ని తెలిపారు. జయలలిత అందించిన చికిత్సపై ఇప్పటి వరకు సరైన వివరాలు వెల్లడి కాకపోవడం శోచనీయమన్నారు. 
 
ఇదిలా ఉంటే.. జయలలిత మృతి నేపథ్యంలో తమిళనాడులో రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెరపైకి కొత్తగా 'అమ్మ' పార్టీ వచ్చింది. 2015లో జయలలిత జైలుకు వెళ్లినప్పుడు ఆమె కేసు నుంచి బయటపడాలని, మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ శిలువ వేసుకున్న షిహాన్‌ హుస్సైనీ ఈ పార్టీని స్థాపిస్తున్నాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments