Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mangaluru: రోడ్డుపై నడుస్తూ వెళ్లిన మహిళను ఢీకొన్న కారు.. తలకిందులుగా వేలాడుతూ.. (video)

సెల్వి
శుక్రవారం, 14 మార్చి 2025 (14:55 IST)
Woman
మహిళలకు రోడ్డుపై నడవడానికి రక్షణ లేకుండా పోతోంది. ఇప్పటికే ఎక్కడపడితే అక్కడ మహిళలపై అకృత్యాలు జరుగుతున్న వేళ.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లిన ఓ మహిళపై హత్యాయత్నం జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే... కర్ణాటక - మంగళూరులో తన పొరుగింట్లో ఉండే మురళీ ప్రసాద్ అనే వ్యక్తిపై కారుతో ఢీకొని హత్యాయత్నం చేశాడు.. సతీశ్ అనే వ్యక్తి. కానీ మురళిని ఢీకొడుతున్న సమయంలో అటు వైపు నడిచి వెళ్తున్న మహిళను కూడా కారుతో సతీష్ ఢీకొట్టాడు. కారు ఢీకొనడంతో ఓ ఇంటి గోడకు తలకిందులుగా ఆ మహిళ వేలాడింది. 
 
ఈ ఘటనలో మురళితో పాటు ఆ మహిళకు కూడా గాయాలైనాయి. దీన్ని గమనించిన స్థానికులు ఆ మహిళను కాపాడి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సతీష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణలో గతంలో మురళి తండ్రిపైన కూడా హత్యాయత్నానికి సతీష్ పాల్పడ్డాడని తెలిసింది. 
 
ఇంకా సతీష్- మురళీల మధ్య వివాదానికి కారణం ఏంటి..? హత్యాయత్నం చేసేంతలా వీరి మధ్య ఏం జరిగిందనే వివిధ కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పోస్టు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత ఆ దర్శకుడుతో ప్రేమలో ఉందా? హీరోయిన్ మేనేజరు ఏమంటున్నారు?

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments