Webdunia - Bharat's app for daily news and videos

Install App

కబ్జాదారులు గెంటేశారు... పంచాయతీ వత్తాసు పలికింది... మోడీజీ న్యాయం చేయండి

కబ్జాదారుల కారణంగా ఉన్న ఇంటిని కోల్పోయిన ఓ 11 యేళ్ల బాలిక ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఓ లేఖ రాశారు. తమ ఇంటిని కబ్జాదారులు స్వాధీనం చేసుకుని ఇంటిని నిర్మిస్తుంటే గ్రామ పంచాయతీ పెద్దలు వత్తాసు పలుకుతున్

Webdunia
శనివారం, 10 జూన్ 2017 (09:09 IST)
కబ్జాదారుల కారణంగా ఉన్న ఇంటిని కోల్పోయిన ఓ 11 యేళ్ల బాలిక ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఓ లేఖ రాశారు. తమ ఇంటిని కబ్జాదారులు స్వాధీనం చేసుకుని ఇంటిని నిర్మిస్తుంటే గ్రామ పంచాయతీ పెద్దలు వత్తాసు పలుకుతున్నారనీ, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదనీ, అందువల్ల తమకు న్యాయం చేయాలంటూ ఆ బాలిక ప్రధాని మోడీకి లేఖ రాసింది.
 
ఒడిషా రాష్ట్రంలోని కటక్ జిల్లాలోని పోఖరి గ్రామానికి చెందిన ఉగ్రసేన్ మొహరానా కుమార్తె శుభశ్రీ రాసిన లేఖలోని వివరాలను పరిశీలిస్తే.. తమ కుటుంబానికి న్యాయం చేయాలని, ఈ విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరింది. ఏ తప్పు చేయకుండానే తమను ఇంటి నుంచి బలవంతంగా బయటకు పంపారని, తిరిగి ఇంటికి చేరుకునేందుకు సాయం చేయాలని లేఖలో కోరింది.
 
గ్రామస్థులు తన తండ్రిపై దాడి చేయడమే కాకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరించారని ఆవేదన వ్యక్తంచేసింది. తమ భూమిని అన్యాయంగా లాక్కునేందుకు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నందుకే తమపై కక్ష కట్టారని వివరించింది. కబ్జాదారులకు గ్రామ పంచాయతీ పెద్దలు సైతం వత్తాసు పలికారని, దీనిపై డీజీపీ కేబీ సింగ్, ఇతర ఉన్నతాధికారులను కలిసినా ఎటువంటి ఫలితం లేకపోవడంతో ప్రధానికి లేఖ రాసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments