Webdunia - Bharat's app for daily news and videos

Install App

85 ఏళ్లుగా తితిదేపై ప్రభుత్వ పెత్తనం.... పిటీషన్ వేస్తున్నా: సుబ్రహ్మణ్య స్వామి

జులై మొదటి వారంలో సుప్రీంకోర్టులో టిటిడి వివాదంపై పిటిషన్ దాఖలు చేయునున్నట్టు సుబ్రహ్మణ్య స్వామి తెలియజేశారు. ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులను విధుల నుంచి తొలగిస్తూ టిటిడి పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని పిటిషన్‌లో కోరనున్నట్టు తెలిపారు.

Webdunia
బుధవారం, 23 మే 2018 (21:47 IST)
జులై మొదటి వారంలో సుప్రీంకోర్టులో టిటిడి వివాదంపై పిటిషన్ దాఖలు చేయునున్నట్టు సుబ్రహ్మణ్య స్వామి తెలియజేశారు. ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులను విధుల నుంచి తొలగిస్తూ టిటిడి పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని పిటిషన్‌లో కోరనున్నట్టు తెలిపారు. తమిళనాడు చిదంబరంలో ఉన్న నటరాజ దేవాలయానికి 2014 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో విముక్తి లభించిందని, ఏ దేవాలయం అయినా ప్రభుత్వ అజమాయిషీలో పరిమిత కాలం మేరకే ఉండవచ్చు అని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు.
 
ఆ తీర్పును ప్రాతిపదికగా తీసుకుని తిరుమల తిరుపతి దేవస్థానములపై సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రభుత్వ పెత్తనాన్ని రద్దు చేయాలని తన పిటిషన్‌లో కోరనున్నట్టు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానములపై ప్రభుత్వ పెత్తనం గత 85 ఏళ్లకు పైగా కొనసాగుతునే ఉంది. గతంలో సుప్రీం కోర్టు తీర్పునే ఉటంకిస్తూ, టిటిడి అంశాన్ని తన పిటిషన్‌లో ప్రశ్నిస్తానని తెలిపారు సుబ్రహ్మణ్య స్వామి. మరి ఈ వివాదం ఎటు మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments