Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను పని రాక్షసుడిని.. కష్టపడి పని చేయడి లేదా రాజీనామాలు చేసి ఇంటికెళ్లండి: సీఎం యోగి

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తేరుకేలోని ఝులక్ ఇచ్చారు. తాను పని రాక్షసుడిని అంటూ హెచ్చరించారు. ఉద్యోగులు కూడా కష్టపడి పని చేయాల్సిందేనని లేకుంటే రాజీన

Webdunia
సోమవారం, 27 మార్చి 2017 (09:12 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తేరుకేలోని ఝులక్ ఇచ్చారు. తాను పని రాక్షసుడిని అంటూ హెచ్చరించారు. ఉద్యోగులు కూడా కష్టపడి పని చేయాల్సిందేనని లేకుంటే రాజీనామాలు చేసి ఇంటికెళ్లాల్సిందేనని ఆయన హెచ్చరించారు. 
 
ఆదివారం గోరఖ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ... పొద్దున్నే పది గంటలకో, పదకొండు గంటలకో తాపీగా ఆఫీసుకు రావడం, టీ తాగేసి, కబుర్లు చెప్పుకోవడం, మధ్యాహ్నం భోజనం, ఆపైన విసుగేస్తే, కాసేపు కునుకేసి, సాయంత్రం 5 కాగానే ఇంటికి వెళ్లిపోదామని భావించే ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై తమ అలవాట్లను మార్చుకోవాలన్నారు. 
 
నిత్యమూ 18 నుంచి 20 గంటల పాటు ఉద్యోగులు పని చేయాల్సి వుంటుందని, అలా కుదరదని అనుకుంటే రాజీనామాలు చేసి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చారు. తాను ఓ పని రాక్షసుడినని, అధికారులూ అలాగే ఉండాలని కోరుకుంటున్నానని, కష్టపడని వారికి ఇక్కడ స్థానం ఉండదని చెప్పారు. పథకాల అమలులో నిర్లక్ష్యాన్ని సహించబోనని స్పష్టం చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments