Webdunia - Bharat's app for daily news and videos

Install App

వికారాబాద్ ఆస్పత్రిలో టీ ఇప్పిస్తానని తీసుకెళ్లి బాలికపై అత్యాచారం

తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో ఓ ఏడేళ్ళ బాలికపై అత్యాచారం జరిగింది. గుర్తుతెలియని ఓ కామాంధుడు ఏడేళ్ళ బాలికకు టీ తాగి స్నాక్స్ కొనుక్కుందామని మాయమాటలు చెప్పి... ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. త

Webdunia
సోమవారం, 27 మార్చి 2017 (08:55 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో ఓ ఏడేళ్ళ బాలికపై అత్యాచారం జరిగింది. గుర్తుతెలియని ఓ కామాంధుడు ఏడేళ్ళ బాలికకు టీ తాగి స్నాక్స్ కొనుక్కుందామని మాయమాటలు చెప్పి... ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
వికారాబాద్‌ జిల్లా తాండూరుకు చెందిన ఏడేళ్ళ బాలిక తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది. అయితే, అమ్మమ్మకు అనారోగ్యం కారణంగా తాండూరు ఆస్పత్రికి తరలించారు. ఆమె గత రెండుమూడు రోజులుగా ఆస్పత్రిలోనే ఉంటూ చికిత్స పొందుతూ వస్తోంది. ఈ క్రమంలో ఏడేళ్ల చిన్నారి అమ్మమ్మను చూసేందుకు ఆస్పత్రికి వెళ్లింది. శనివారం రాత్రి ఆస్పత్రి ఆవరణలో ఉన్న బాలికను గుర్తు తెలియని వ్యక్తి టీ తాగిస్తానని అక్కడి నుంచి తీసుకువెళ్లాడు.
 
ఆమె తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి విధులు నిర్వహిస్తున్న పురపాలక సిబ్బంది కొడంగల్‌ రోడ్డులో బాలికను గుర్తించి ఠాణాలో అప్పగించారు. అక్కడికి చేరుకున్న కుటుంబీకులు బాలికను ఆరా తీయగా జరిగిన అఘాయిత్యాన్ని వివరించింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌ తరలించారు. కామాంధుడిని గుర్తించేందుకు మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments