Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంత గాఢ నిద్రలోఉన్నా, తల్లిపేరు వినిపించగానే..?

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (11:27 IST)
కౌసల్య.. అమ్మ పేరు వినిపించగానే గాఢనిద్రలో ఉన్న కమలాక్షుడి కనురెప్పలలో కదలిక, కౌసల్యమ్మ రూపం మనసులో మెదిలే ఉంటుంది. పెదాల మీద చిరునవ్వు, అద్దంలో చందమామను చూపుతూ అమ్మ తినిపించిన పాలబువ్వ గుర్తుకొచ్చి ఉంటుంది. విశ్వామిత్రుడి వెను వెంట.... యాగ సంరక్షణకు బయలుదేరే సమయానికి రాముడు కౌమారుడే అయినా, అచ్చంగా అమ్మచాటు బిడ్డ. 
 
ఎంత గాఢ నిద్రలోఉన్నా, తల్లిపేరు వినిపించగానే బిడ్డ దిగ్గున మేల్కొంటాడు. కౌసల్యా సుప్రజా రామ... పదమోగ రహస్యమూ అదే. వాల్మీకి రామాయణంలో బ్రహ్మజనకుడికి బ్రహ్మర్షి పలికిన ఆ మేలుకొలుపే వేంకటేశ్వర సుప్రభాతానికి ప్రారంభ శ్లోకం. త్రేతాయుగంలో రాముడికి పలికిన సుప్రభాతం.. కలియుగంలో వేంకటరాముడి సుప్రభాతమైంది.
 
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం.. తెలతెలవారుతోంది. కర్తవ్య నిర్వహణకు సమయం ఆసన్నమైందని విశ్వామిత్ర మహర్షి రాముడికి గుర్తుచేస్తున్నాడు. తెల్లారేలోపు సంధ్యాది విధులు ముగించుకుని విల్లంబులతో యాగ సంరక్షణకు బయల్దేరాలి. లలితమోహనాంగుడైన రాముడు.. ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేలీ విహార లక్షీ నారసింహా అన్నట్టుగా నరశార్దూలమై నృసింహావతారం నాటి ఉగ్రత్వాన్ని ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది. సూర్యోదయం మార్పునకు ప్రతీక. ఆ మార్పు చెడు నుంచి మంచి వైపు కావచ్చు. అస్పష్టత నుంచి స్పష్టత వైపు కావచ్చు. ఐహిక విషయాల నుంచి అలౌకిక జిజ్ఞాస వైపుగా కావచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మెడికో ప్రియాంక కేసు.. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు : హోం మంత్రి అనిత

వైద్య విద్యార్థిని ప్రియాంక కేసులో కీలక పరిణామం : సెక్షన్లు మార్చనున్న పోలీసులు

జెన్ జీ మన పిల్లలే ... పిల్లల భవిష్యత్ కంటే మంత్రి పదవి ముఖ్యం కాదు : ధర్మేంద్ర ప్రధాన్

జగన్ శిష్యులం... ఆయన కోసం ఎంతకైనా తెగిస్తాం : వైకాపా నేత చింతాడ

సెలవు అడిగితే ఉద్యోగం నుంచి తీసేశారు.. మనస్తాపంతో బలవన్మరణం

అన్నీ చూడండి

లేటెస్ట్

09 ఆగస్టు 2026 ఆదివారం: తెలుగు పంచాంగ వివరాలు ఎలా వున్నాయి?

09-08-2026 ఆదివారం మీ రాశి ఫలితాలు- వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు..

09-08-2026 నుంచి 15-08-2026 వరకు వార ఫలితాలు నేడు సాధ్యం కానిది రేపు...?

08-08-2026 నాటి తెలుగు పంచాంగ వివరాలు ఎలా వున్నాయంటే?

08-08-2026 శనివారం ఫలితాలు - నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు...

తర్వాతి కథనం
Show comments