Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కలకలం ... కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

Webdunia
బుధవారం, 28 అక్టోబరు 2020 (16:47 IST)
యూరప్ దేశాల్లో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ దేశాల్లో కరోనా రెండో దశ సంక్రమణ అంటే రెండో దశ ప్రారంభమైందనే వార్తలు వస్తున్నాయి. ఈ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్‌పై పడింది. ఫలితంగా స్టాక్ మార్కెట్ తీవ్ర నష్టాలను చవిచూసింది. 
 
యూరప్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీనికి తోడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణితో వ్యవహరించడంతో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.
 
దీంతో బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 599 పాయింట్లు నష్టపోయి 39,922కి పడిపోయింది. నిఫ్టీ 159 పాయింట్లు కోల్పోయి 11,729కి చేరుకుంది. టెలికాం, కన్జ్యూమర్ గూడ్స్ సూచీలు మినహా మిగిలినవన్నీ నష్టాల్లోనే ముగిశాయి.
 
ఈ రోజు స్టాక్ మార్కెట్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ భారతి ఎయిర్ టెల్ (4.26%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.17%), మారుతి సుజుకి (0.33%), ఎల్ అండ్ టీ (0.12%) కంపెనీలు ఉన్నాయి. 
 
అలాగే, ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.45%), ఐసీఐసీఐ బ్యాంక్ (-3.34%), టెక్ మహీంద్రా (-3.00%), బజాజ్ ఫైనాన్స్ (-2.41%), అల్ట్రాటెక్ సిమెంట్ (-2.39%) కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments