Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారాలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన భనీనా పటేల్ - ప్రశంసల వర్షం

Webdunia
ఆదివారం, 29 ఆగస్టు 2021 (12:06 IST)
టోక్యో వేదికగా పారాలింపిక్స్ పోటీలు  జరుగుతున్నాయి. ఈ పోటీల్లోభాగంగా టేబుల్ టెన్నిస్ పోటీలో భారత్‌కు సిల్వర్ పతకం లభించింది. ఈ పోటీల్లో గుజరాత్‌కు చెందిన క్రీడాకారిణి భవీనా బెన్ పటేల్ సరికొత్త చరిత్ర సృష్టించి భారత్‌కు పతకాన్ని అందించారు. ముఖ్యంగా, పారాలింపిక్స్‌ చరిత్రలోనే టేబుల్‌ టెన్నిస్‌లో దేశానికి పతకం రావ‌డం ఇదే తొలిసారి. దీంతో ఆమెపై దేశ వ్యాప్తంగా ప్ర‌ముఖులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.
 
టోక్యో పారాలింపిక్స్‌లో వెండి పతకాన్ని సాధించిన భవీనాబెన్‌ పటెల్ దేశంలోని క్రీడాకారుల్లో, క్రీడాభిమానుల్లో స్ఫూర్తిని నింపింద‌ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ప్ర‌శంసించారు. ఆమె నిబద్ధ‌త, నైపుణ్యాల వ‌ల్ల దేశానికి మంచి పేరు వ‌చ్చింద‌ని చెప్పారు. ఇటువంటి గొప్ప విజ‌యాన్ని సాధించిన ఆమెకు అభినంద‌న‌లు తెలుపుతున్నాన‌ని ట్వీట్ చేశారు.
 
అలాగే, ప్రధాని నరేంద్ర మోడీ కూడా భవీనా పటేల్‌కు అభినందనలు తెలిపారు. ఆమె చ‌రిత్ర లిఖించింద‌ని, ఆమె జీవితం చాలా మందికి స్ఫూర్తివంత‌మైంద‌న్నారు. ఆమె జీవిన ప్ర‌యాణం దేశంలోని యువ‌త‌ను క్రీడ వైపున‌కు ఆక‌ర్షిస్తోంద‌న్నారు. 
 
భవీనా బెన్‌ పటేల్‌కు రాజ‌కీయ, క్రీడా ప్ర‌ముఖుల నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. ఆమె సాధించిన విజ‌యంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఆమె మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని ఆకాంక్షించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

దేశం కోసం చనిపోతా.. మృతదేహంపై జాతీయ జెండా ఉంచండి... మురళీ నాయక్ చివరి మాటలు (Video)

సింధూ జలాల ఒప్పందం రద్దులో జోక్యం చేసుకోం : తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాక్ చీఫ్

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

బ్రిటీష్ కాలం నాటి కథతో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్నచిత్రం

కమల్ హాసన్ థగ్ లైఫ్ వేడుకకు సమయంకాదని వాయిదా

తర్వాతి కథనం
Show comments