Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో మద్యం బాబులకు ఫుల్ హ్యాపీ, అల్పాహారానికి ముందే మందు లభ్యం

Webdunia
మంగళవారం, 11 మే 2021 (16:52 IST)
తెలంగాణ రాష్ట్రంలో లాక్‎డౌన్​ నేపథ్యంలో మందుబాబులకు ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. ఇక తెల్లారి లేవంగానే మద్యం దుకాణాల ఎదుట క్యూ కట్టాల్సి ఉంటుంది. లాక్​డౌన్​ కాలంలో వైన్స్‌ షాపులను ఉదయం 6 నుంచి 10 గంటల వరకు తెరిచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
 
ఈ మేరకు అబ్కారీ శాఖకు ప్రాథమికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా అబ్కారీ కార్యాలయాలు కూడా ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఉంటాయని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం ఏపీలో కూడా ఉదయమే మద్యం దుకాణాలను తెరుస్తున్నారు.
 
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రంలో లాక్​డౌన్​ ఖరారైంది. అయితే లాక్​డౌన్​లో నిత్యావసరాలతో పాటుగా మద్యం దుకాణాలను కూడా తెరిచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం దుకాణాలతో ఆదాయం తగ్గకుండా ఈ చర్యలు చేపట్టింది.
 
 దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సైతం ఖరారు చేస్తోంది. పాలు, కూరగాయల దుకాణాలతో పాటుగా మద్యం దుకాణాలను కూడా ఉదయమే తెరిచి ఉంచుకోవాలని సూచిస్తోంది. ప్రస్తుతం మద్యం దుకాణాలను ఉదయం 10 గంటల తర్వాతే తెరుస్తుండగా… ఇప్పుడు ఉదయం 10 గంటల తర్వాత మూసివేయనున్నారు.
 
ఇక మందుబాబులు లాక్​డౌన్​లో మద్యం కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో లాక్​డౌన్​ ఉంటుందని చాలాచోట్ల నెలకు సరిపడా మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం లాక్​డౌన్​ నేపథ్యంలో మద్యం దుకాణాలకు వెసులుబాటు కల్పించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం