Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి కోసం కన్నతండ్రిని హత్య చేసిన తనయులు

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (08:40 IST)
ఆస్తిని సమానంగా పంచలేదన్న అక్కసుతో కన్నతండ్రిని కన్నకుమారులు కాటికి పంపారు. ఆస్తి కోసం దారుణంగా హత్య చేశారు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా అందోలు మండలం బ్రాహ్మణపల్లిలో బుధవారం అర్థరాత్రి జరిగింది. 
 
జోగిపేట ఎస్ఐ వెంకటేశం వెల్లడించిన వివరాల మేరకు... బ్రాహ్మణపల్లికి చెందిన పెద్దగొల్ల పాపయ్య(60) అనే వ్యక్తికి విఠల్‌, నరేశ్‌, కృష్ణ, చిరంజీవి అనే కుమారులు ఉన్నారు. కృష్ణ వట్పల్లిలో ఉంటుండగా మిగతా ముగ్గురూ గ్రామంలోనే విడిగా ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. 
 
భార్య నాలుగేళ్ల క్రితమే మృతిచెందగా పాపయ్య పెద్ద కుమారుడు విఠల్‌ వద్ద ఉంటున్నాడు. తండ్రి పేరిట ఉన్న 9 ఎకరాల పొలం పంపకాల విషయంలో అన్నదమ్ముల మధ్య విభేదాలు మొదలయ్యాయి. పెద్దకుమారుడు విఠల్‌కు మిగతా వారికంటే కొంత భూమి ఎక్కువ ఇస్తాననని పాపయ్య చెప్పాడు. దీనికి నరేష్‌, కృష్ణ అభ్యంతరం చెప్పారు. 
 
ఈ క్రమంలో బుధవారం రాత్రి నరేష్‌, కృష్ణ బ్రాహ్మణపల్లికి చేరుకున్నారు. ఇంట్లోని మొదటి అంతస్తులో నిద్రిస్తున్న తండ్రి పాపయ్య వద్దకు వెళ్లి ఇటుకతో తలపై బలంగా మోదారు. కింది గదిలో పడుకున్న విఠల్‌ అరుపులు విని పైకి వెళ్లి చూసేసరికి రక్తపు మడుగులో తండ్రి మృతదేహం కనిపించింది. నిందితులు ఇద్దరూ పరారయ్యారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments