Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ 9 కొనేందుకు జీ నెట్ వ‌ర్క్... రూ.850 కోట్ల‌కు బేరం

హైద‌రాబాద్ : అటు తెలంగాణాలో, ఇటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మంచి రేటింగ్ సాధిస్తున్న టీవీ 9ని చేజిక్కించుకునేందుకు జీ నెట్వ‌ర్క్ పావులు క‌దుపుతోంది. సంస్థ బ్రాండ్ వ్యాల్యూయేష‌న్ వేసే ప‌నిలో ఉంది. అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్ర‌వేట్ లిమిటెడ్(ఎ

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (18:09 IST)
హైద‌రాబాద్ : అటు తెలంగాణాలో, ఇటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మంచి రేటింగ్ సాధిస్తున్న టీవీ 9ని చేజిక్కించుకునేందుకు జీ నెట్వ‌ర్క్ పావులు క‌దుపుతోంది. సంస్థ బ్రాండ్ వ్యాల్యూయేష‌న్ వేసే ప‌నిలో ఉంది. అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్ర‌వేట్ లిమిటెడ్(ఎబిసిఎల్)లో ప్ర‌ధాన వాటాదారుడిగా ఉన్న శ్రీనిరాజు టీవీ 9ని అమ్మాల‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. 
 
కొద్దిరోజులు మై హోమ్ రామేశ్వ‌ర‌రావు ద్వారా దీని కొనుగోలుకు తెలంగాణా సీఎం కేసీఆర్ స‌న్నిహితులు ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ, అది వ‌ర్కవుట్ కాలేదు. ఇపుడు దానిని 850 కోట్ల రూపాయ‌ల‌కు కొనుగోలు చేసేందుకు జీ గ్రూప్ ఆఫ‌ర్ చేసిన‌ట్లు తెలిసింది. టీవీ 9 తెలుగుతో పాటు క‌న్న‌డ‌, మ‌రాఠీ, గుజ‌రాతీ, ఇంగ్లిష్, జై తెలంగాణా త‌దిత‌ర 7 ఛాన‌ళ్ళున్నాయి. వీట‌న్నింటినీ క‌లిపి కొనుగోలు చేయాల‌ని జీ నెట్వ‌ర్క్ ఆలోచ‌న‌లో ఉంది. 
 
కొద్ది రోజుల క్రిత‌మే జీ గ్రూప్ టెన్ స్పోర్ట్స్‌ని 2,500 కోట్ల రూపాయ‌ల‌కు సోనీకి విక్ర‌యించింది. ఇపుడు ఆ న‌గ‌దుతో ప్రాంతీయ భాష‌ల్లో ప‌ట్టు కోసం జీ ప్ర‌య‌త్నిస్తోంది. ఇందులో భాగంగానే టీవీ 9ని కొనే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసిన‌ట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంగ్రాట్స్ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యా, నువ్వు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవ్వాలి

Pawan: హరిహరవీరమల్లుకు డేట్ ఫిక్స్ చేసిన పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్. వార్ 2 గురించి హృతిక్ రోషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

చైనా ఉత్పత్తులను కొనడం మానేద్దాం.. మన దేశాన్ని ఆదరిద్దాం : రేణూ దేశాయ్ పిలుపు

Eleven review :నవీన్ చంద్ర నటించిన ఎలెవెన్ చిత్ర సమీక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments