Webdunia - Bharat's app for daily news and videos

Install App

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుకు నష్టాలు మిగిల్చిన 'బాహుబలి'

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. 'బాహుబలి' చిత్ర సమర్పకుడు. చిత్ర నిర్మాణంలో భాగస్వామి కూడా. అయితే, ఈయన 'బాహుబలి' చిత్రంలో తీవ్రంగా నష్టపోయారట. ఈ నష్టాలు బాహుబలి రెండో భాగంలో భర్తీ అవుతాయన్న నమ్మకంతో వ

Webdunia
బుధవారం, 3 మే 2017 (13:52 IST)
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. 'బాహుబలి' చిత్ర సమర్పకుడు. చిత్ర నిర్మాణంలో భాగస్వామి కూడా. అయితే, ఈయన 'బాహుబలి' చిత్రంలో తీవ్రంగా నష్టపోయారట. ఈ నష్టాలు బాహుబలి రెండో భాగంలో భర్తీ అవుతాయన్న నమ్మకంతో వారు ఉన్నారు. 'బాహుబలి' చిత్ర నిర్మాతలు ఏంటి.. నష్టపోవడమా? అనే కదా మీ సందేహం. నిజంగానే నష్టపోయారట.
 
2015లో విడుదలైన బాహుబలి చిత్రం సరికొత్త రికార్డులను తిరగరాస్తూ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రం విడుదల తర్వాత గత రికార్డులన్నీ తుడుచిపెట్టుకుని పోయాయి. అమోఘం.. అద్భుతం.. కనకవర్షం.. కలెక్షన్ల తుఫాను లాంటి విశేష గణాలతో బాహుబలి సినిమా హోరెత్తిపోయింది. అయితే ఈ చిత్రం తొలిభాగం రూ.125 కోట్లతో తెలుగునాట టాప్ గ్రాసర్‌గా నిలిచింది. అయినా సరే ఈ చిత్రం తమకు నష్టాలే చవిచూపిందని నిర్మాతలు అంటున్నారు. ఈ చిత్ర సమర్పకుడు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, చిత్ర నిర్మాతలు శోభూ యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని తదితరులు ఈ చిత్ర నష్టంపై నివ్వెరపోయారు. 
 
నిజానికి ఈ సినిమాకి తెలుగునాట బయ్యర్ల నుంచి ఓవర్ ఫ్లో వచ్చినా తగువిధంగా రిటర్న్స్ ఇవ్వలేదని నిర్మాతల ప్రధాన ఆరోపణ. పైగా ఈ చిత్రాన్ని ఇటు జర్మన్, అటు మండేరియన్ భాషల్లోకి అనువాదం చేసి రిలీజ్ చేయడంతో మరిన్ని నష్టాలు చవిచూసినట్టు తెలుస్తోంది. ఈ మాటే చిత్ర నిర్మాతలు కూడా చెబుతున్నారట. అయితే, ఈ నష్టాలను గత నెలలో విడుదలైన బాహుబలి 2 చిత్రంతో భర్తీ చేసుకునే అవకాశం ఉంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

దేశం కోసం చనిపోతా.. మృతదేహంపై జాతీయ జెండా ఉంచండి... మురళీ నాయక్ చివరి మాటలు (Video)

సింధూ జలాల ఒప్పందం రద్దులో జోక్యం చేసుకోం : తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాక్ చీఫ్

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments