Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో.. మహేష్ తెలివితేటలు.. 300 శాతం పెరిగిన రెమ్యునరేషన్

Webdunia
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (13:07 IST)
తెలుగు హీరోల్లో మహేష్ బాబు ఒకరు. వరుస హిట్లతో దూసుకెళుతున్నారు. 'భరత్ అనే నేను', 'మహర్షి', తాజాగా 'సరిలేరు నీకెవ్వరు' వంటి సూపర్ డూపర్ హిట్స్‌తో ఇండస్ట్రీలో తనకు తిరుగులేదని నిరూపించాడు. అదేసమయంలో తన రెమ్యునరేషన్‌ను కూడా ఏకంగా 300 శాతం మేరకు పెంచుకున్నారు. 'మహర్షి' చిత్రానికి రూ.20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న మహేష్ బాబు.. 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం కోసం ఏకంగా రూ.82 కోట్లను అందుకున్నారు. అయితే, ఈ మొత్తం రెమ్యునరేషన్ కింద ఇవ్వలేదు. ఈ ట్రిక్ ఏంటో ఇపుడు తెలుసుకుందాం. 
 
సాధారణంగా ఒక చిత్రంలో నటించేందుకు తనకు ఇంత రెమ్యునరేషన్ కావాలని హీరో అడుగుతుంటారు. కానీ, మహేష్ బాబు మాత్రం 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం కోసం ఒక్క పైసా కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఈ చిత్రాన్ని రూ.75 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇందులో మహేష్ బాబు ఒక్క పైసా కూడా పెట్టుబడిగా పెట్టలేదు. కానీ, ఈ చిత్ర నిర్మాత అనిల్ సుంకర, సహ నిర్మాత దిల్ రాజులకు హీరోకు మధ్య ఉన్న సత్‌సంబంధం కారణంగా... నాన్ థియేట్రికల్ రైట్స్‌ను మహేష్‌కు నిర్మాతలు ఇచ్చారు. వీటి విలువ రూ.82 కోట్లు. అంటే... దక్షిణాదిలో అత్యధిక మొత్తాన్ని స్వీకరించిన హీరోగా మహేష్ బాబు నిలిచారు. 
 
ఇది నిజంగానే హీరోకు - నిర్మాతలకు మధ్య ఉన్న మంచి సంబంధంగా చెప్పుకోవచ్చు. పైగా, మహర్షి చిత్రానికి రూ.20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న మహేష్.. సరిలేరు నీకెవ్వరు చిత్రానికి రూ.82 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు అయింది. అంటే మహేష్ రెమ్యునరేషన్ 300 శాతం మేరకు పెరిగిందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, ఈ చిత్రం వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్లు రూ.217.18 కోట్లుగా ఉన్నట్టు సమాచారం. అలాగే, ఈ చిత్ర నిర్మాతలు ఏకంగా 103 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందగా, పంపిణీదారులు కూడా రూ.137.55 కోట్ల మేరకు ఆదాయం పొందినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టెన్త్ రిజల్ట్స్ : కాకినాడ విద్యార్థిని నేహాంజనికి 600/600 మార్కులు

పహల్గామ్‌ అటాక్: పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించని ప్రధాని

సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం - వార్ ఫ్లైట్‌ను తరలిస్తున్న పాకిస్థాన్!!

పహల్గామ్‌ అటాక్: ప్రధాన సూత్రధారి సైఫుల్లా సాజిద్ జట్?

పహల్గామ్ ఉగ్రదాడి : నెల్లూరు జిల్లా కావలి వాసి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments