Webdunia - Bharat's app for daily news and videos

Install App

#RRR చెర్రీ పుట్టిన రోజున రాజమౌళి సినిమా పోస్టర్ రిలీజ్ అవుతుందా?

#RRR అనే పేరిట ప్రముఖ దర్శకుడు రాజమౌళి తాజా సినిమాపై డీవీవీ వీడియో విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో మల్టీస్టారర్ సినిమాకు బాహుబలి తర్వాత జక్కన్న సై అన్నారని తేలిపోయి

Webdunia
శనివారం, 24 మార్చి 2018 (16:26 IST)
#RRR అనే పేరిట ప్రముఖ దర్శకుడు రాజమౌళి తాజా సినిమాపై డీవీవీ వీడియో విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో మల్టీస్టారర్ సినిమాకు బాహుబలి తర్వాత జక్కన్న సై అన్నారని తేలిపోయింది. ఈ నేపథ్యంలో చరణ్ పుట్టిన రోజు ఈ నెల 27వ తేదీ కావడంతో.. #RRR సినిమాకు సంబంధించిన స్టిల్‌ను రాజమౌళి విడుదల చేస్తారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. 
 
ఇటీవల అమెరికాలో జరిగిన టెస్ట్ షూట్ నుంచి ఆ స్టిల్ సోషల్ మీడియాలో విడుదలయ్యే అవకాశం వుందని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. బాహుబలి సమయంలో ఆర్టిస్టుల పుట్టిన రోజున వారికి సంబంధించిన స్టిల్స్‌ను రాజమౌళి రిలీజ్ చేశారు. ఇదే తంతు #RRR మూవీకి కూడా కొనసాగిస్తాడని టాక్
 
మరోవైపు చెర్రీ పుట్టిన రోజున మెగా ఫ్యాన్స్‌కు బంపర్ ట్రీట్ రెడీగా వున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది. తాజాగా బోయపాటితో చరణ్ చేస్తోన్న మూవీ నుంచి కూడా ఒక పోస్టర్ మిస్టర్ సి బర్త్‌డేకి విడుదల కావొచ్చునని చెప్తున్నారు. 
 
ఇంకా ''సైరా'' సినిమాకి చరణ్ నిర్మాత కనుక, ఆ మూవీ నుంచి కూడా ఒక స్పెషల్ పోస్టర్ వచ్చే ఛాన్స్ వుందట. ఇక ముఖ్యంగా 'రంగస్థలం' నుంచి ట్రైలర్ రావడం ఖాయమని తెలుస్తోంది. ఇంకేముంది? మెగా అభిమానులకు ఇంతకి మించిన పండగేముంటుంది?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌కు పగటిపూటే చుక్కలు... యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌తో మిలిటరీ పోస్ట్‌ను ధ్వంసం (Video)

భారత్ పాకిస్థాన్ యుద్ధం : విమాన ప్రయాణికులకు అలెర్ట్

దేశం కోసం ఏమైనా చేస్తాం : ముఖేశ్ అంబానీ - గౌతం అదానీ

పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ నిధులపై సమీక్ష.. అడ్డు చెప్పనున్న భారత్!

భారత్ పాక్ యుద్ధం : దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments