Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంకర్ శ్యామల భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (15:45 IST)
ప్రముఖ టీవీ యాంకర్, నటి శ్యామల భర్త నరసింహరెడ్డితో పాటు మరో మహిళను అరెస్టు చేశారు. వారిపై ఒక మహిళ చీటింగ్ కేసు పెట్టింది. ఈ కేసును నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు వీరిద్దరిని అరెస్ట్ చేశారు.
 
మహిళ తన ఫిర్యాదులో, శ్యామల భర్త నరసింహరెడ్డి 2017 నుండి వాయిదా ప్రాతిపదికన తన వద్ద కోటి రూపాయలు తీసుకున్నారని తెలిపింది. తన డబ్బు గురించి అతనిని అడిగినప్పుడు, శ్యామల భర్త నరసింహ రెడ్డి తనను బెదిరించారని తెలిపింది. అంతేకాకుండా నరసింహా రెడ్డి తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు తెలిపింది.
 
సమస్యను పరిష్కరిస్తానంటూ వివాదం మధ్యలోకి మరో మహిళ వచ్చిందని ఆమె చెప్పారు. వీరిరువురూ తనను బెదిరించారనీ, డబ్బులు ఇవ్వకుండా వేధించారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
 
కాగా శ్యామల తన భర్తతో కలిసి 2019లో వైయస్‌ఆర్‌సిపి పార్టీలో చేరింది. ఆ తర్వాత ఈ ఏడాది మార్చి నెలలో హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో వైయస్ షర్మిలాను కలిశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం