Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశ్వక్ సేన్ సినిమాలో రత్నమాలగా అంజలి

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2023 (17:04 IST)
Anjali
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అత్యంత వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తోంది. నిర్మాతలు సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్యలు గొప్ప అభిరుచితో నిర్మిస్తున్న చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.
 
ఇప్పుడు ఈ ప్రముఖ నిర్మాణ సంస్థ నుంచి ఆసక్తికరమైన చిత్రం 'VS 11' వస్తోంది. ఈ సినిమాలో బహుముఖ ప్రతిభావంతుడు, యంగ్ అండ్ డైనమిక్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తున్నారు.
 
ఈ యాక్షన్ డ్రామా చిత్రంలో యువ నటుడు విశ్వక్ సేన్ క్రూరమైన పాత్రను పోషిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య రచయితగా, దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
 
విలక్షణ నటి అంజలి పుట్టినరోజు(జూన్ 16) సందర్భంగా ఈ సినిమా నుంచి ఆమె ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమాలో ఆమె రత్నమాలగా కనిపించనున్నారు.
 
అంజలి ఉత్తమమైన పాత్రలను, స్క్రిప్ట్‌లను ఎంచుకుంటారు. ఆమెకు ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ ఉంది. రత్నమాలగా ఆమె మాస్‌ ప్రేక్షకులను అలరించనున్నారు.
 
లిటిల్ మేస్ట్రో యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఆయన సంగీతం సినిమాలకు ప్రధాన బలంగా నిలుస్తుందని చిత్ర బృందం చెబుతోంది.
 
ఇప్పటికే విడుదలైన విశ్వక్ సేన్ గంగానమ్మ జాతర, రాగ్స్ టు రిచ్స్ పోస్టర్లు విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచేశాయి. క్రూరమైన వ్యక్తి కథను చూసేందుకు సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
 
ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - చెవి కమ్మలు నొక్కేసిన ఆస్పత్రి వార్డు బాయ్ (Video)

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments