Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మహానటి'లో భానుమతిగా దేవసేన

సీనియర్ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "మహానటి". ఇందులో సావిత్రి పాత్రను కీర్తి సురేష్ పోషిస్తోంది. అలాగే, టాలీవుడ్ లేడీ సూపర్‌స్టార్ అనుష్క కూడా ఇందులో కీలకమైన పాత్రను పోషించ

Webdunia
ఆదివారం, 18 ఫిబ్రవరి 2018 (11:36 IST)
సీనియర్ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "మహానటి". ఇందులో సావిత్రి పాత్రను కీర్తి సురేష్ పోషిస్తోంది. అలాగే, టాలీవుడ్ లేడీ సూపర్‌స్టార్ అనుష్క కూడా ఇందులో కీలకమైన పాత్రను పోషించనుంది. 
 
అలనాటి నటి భానుమతి పాత్రలో 'భాగమతి' అనుష్క శెట్టి నటిస్తున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక సినిమాలు చేసిన నటీమణుల్లో సావిత్రి, భానుమతిలు కూడా ఉన్నారు. ఆమె పాత్రలో అనుష్కనే సరిపోతారని చిత్రబృందం భావించిందట. అయితే ఈ పాత్రకు అనుష్క ఒప్పుకుందా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. అలాగే, అక్కినేని ఇంటి కోడలు సమంత కూడా జర్నలిస్టుగా నటిస్తున్న విషయం తెల్సిందే. 
 
కాగా, ప్రముఖ నిర్మాత సి.అశ్వినీదత్ సొంత సంస్థ వైజయంతి మూవీస్‌ పతాకంపై తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్‌బాబు, ప్రకాశ్‌రాజ్, దుల్కర్‌ సల్మాన్, విజయ్‌ దేవరకొండ, విక్రమ్‌ ప్రభు, షాలిని పాండే ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తు్న్నారు. మిక్కీ జే మేయర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. మార్చి 20న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

IMD: ఏపీలో మే 10 నుండి 14 వరకు వర్షాలు.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో..?

Z+ Security: జెడ్ ప్లస్ భద్రత ఇవ్వండి లేదా బుల్లెట్ ఫ్రూఫ్ కారునైనా వాడుకుంటా!

Hyderabad Woman Doctor: రూ.5 లక్షల విలువైన కొకైన్ కోసం ఆర్డర్ చేసిన వైద్యురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments