Webdunia - Bharat's app for daily news and videos

Install App

సస్పెన్స్ వీడింది.. 'బిగ్‌బాస్-2' హౌస్‌కు వెళ్లింది వీరే...

ఎట్టకేలకు సస్పెన్స్‌ వీడింది. నేచురల్ స్టార్ నాని హీరోగా ప్రారంభమైన "బిగ్ బాస్ 2" రెండో సీజన్ ఆదివారం రాత్రి ప్రముఖ టీవీ 'స్టార్ మా'లో ప్రారంభమైంది. ఈ షోలో పాల్గొనబోయే కంటెస్టంట్స్‌పై వివిధ రకాలైన ఊహా

Webdunia
సోమవారం, 11 జూన్ 2018 (09:16 IST)
ఎట్టకేలకు సస్పెన్స్‌ వీడింది. నేచురల్ స్టార్ నాని హీరోగా ప్రారంభమైన "బిగ్ బాస్ 2" రెండో సీజన్ ఆదివారం రాత్రి ప్రముఖ టీవీ 'స్టార్ మా'లో ప్రారంభమైంది. ఈ షోలో పాల్గొనబోయే కంటెస్టంట్స్‌పై వివిధ రకాలైన ఊహాగానాలు వచ్చాయి. నెటిజన్లు అయితే తమకు తోచిన విధంగా ఓ జాబితాను తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది.
 
కానీ, అన్ని రకాల ఊహాగానాలకు ఆదివారం రాత్రి తెరపడింది. నేచురల్ స్టార్ నాని ఒక్కొక్కరినీ హౌస్‌లోకి ఆహ్వానించాడు. మొత్తం 16 మంది ఈ పోటీలో పాల్గొంటుండగా, అందులో 13 మంది సెలబ్రిటీలు, మిగతా ముగ్గురు సామాన్యులు కావడం విశేషం.
 
హౌస్‌లోకి వెళ్లిన మొదటి సెలబ్రిటీ నేపథ్య గాయని గీతామాధురి కాగా, తర్వాత వరుసగా అమిత్ తివారీ, న్యూస్ ప్రెజెంటర్ దీప్తి, ప్రముఖ హేతువాది బాబు గోగినేని, నటుడు తనీష్, నటి భానుశ్రీ, రోల్ రిదా, యాంకర్ శ్యామల, కిరిటి దామరాజు, ఇన్‌స్టాగ్రామ్ క్వీన్ దీప్తి సునయన, కౌశల్, తేజస్వీ, సామ్రాట్ రెడ్డి, గణేశ్, సంజన అన్నె (మోడల్), నూతన్ నాయుడు ఉన్నారు. ఆదివారం సెలబ్రిటీల పరిచయంతోనే సరిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments