Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా జీవితానికి ఆమె ఓ డిజైనర్ : ఎస్ఎస్.రాజమౌళి

Webdunia
సోమవారం, 16 జనవరి 2023 (14:18 IST)
ప్రముఖ దర్శకుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ మూవీకి బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ అవార్డును క్రిటిక్స్ చాయిస్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా రాజమౌళి కీలక ప్రసంగం చేశారు. తన ప్రసంగంలో భారతీయతను తలపించడమే కాకుండా, ఎంతో మంది మనసులను గెలుచుకుంది. ఆయన అందరికీ నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగం మొదలు పెట్టారు. చివరికి మేరా భారత్ మహాన్ అంటూ ముగించారు. 
 
"ఈ అవార్డును నా జీవితంలోని మహిళలు అందరికీ అంకితం ఇస్తున్నాను. మా అమ్మ రాజనందిని పాఠశాల విద్య కంటే కూడా నన్ను కామిక్స్, స్టోరీ పుస్తకాలు ఎక్కువ చదివేలా ప్రోత్సహించింది. నాలో సృజనాత్మకతను ప్రోత్సహించింది. మా వదిన శ్రీవల్లి (నాకు అమ్మ వంటిది) ఎప్పుడూ కూడా నేను జీవితంలో మెరుగ్గా ఉండాలని కోరుకునేది. 
 
నా జీవిత భాగస్వామి రమ, నా సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసినా, నా జీవితానికి ఆమె డిజైనర్. ఆమే లేకపోతే నేను ఈ రోజు ఇక్కడ ఉండే వాడిని కాదు. నా కుమార్తెలు ఏమీ చేయక్కర్లేదు. వారి చిరునవ్వు చాలు నా జీవితాన్ని వెలగించడానికి" అని రాజమౌళి ప్రసంగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టుగా వైకాపా ఓమిటికి బోలెడు కారణాలున్నాయ్... బొత్స

అధికారులు - కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే అప్పన్న భక్తులను చంపేసింది .. అందుకే వేటు!

నల్లమల అడవుల్లో ఒంటరిగా వెళ్లొద్దంటున్న అధికారులు.. ఎందుకు?

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments